మేకను బంధించిన అధికారులు.. ఎందుకో తెలుసా?

by  |
haritha-haram,-goat
X

దిశ, నాగార్జునసాగర్: నల్లగొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. హరితహారంలో భాగంగా నాటిన మొక్కను తిన్నదని అధికారులు మేకపిల్లను బంధించారు. ఈ ఘటన నాగార్జునసాగర్‌ నందికొండ మున్సిపాలిటీ పరిధిలో వెలుగుజూసింది. వివరాళ్లోకి వెళితే.. ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. కానీ, మొక్కలకు రక్షణగా ట్రీగార్డ్ మాత్రం ఏర్పాటు చేయలేదు. దీంతో ఆ మొక్కలను ఆవులు, మేకలు ఆహారంగా మేస్తున్నాయి. శుక్రవారం ఓ మేక హరితహారం మొక్క తింటుండగా మున్సిపల్ అధికారులు చూసి, ఆ మేకను మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో, ఆవులను స్టేషన్‌కు తరలించి బంధించారు. అంతేగాకుండా.. వాటి యజమానులను మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి హెచ్చరించారు.


Next Story

Most Viewed