ఢిల్లీని ఢీ కొట్టిన ముంబై

by  |
ఢిల్లీని ఢీ కొట్టిన ముంబై
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ సమజ్జీవుల పోరులో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. రోహిత్ శర్మ 5 పరుగులు చేసి పెవిలియన్ చేరినా.. క్వింటెన్ డీకాక్(53), సూర్యకుమార్ యాదవ్(53) హాఫ్ సెంచరీలతో మంచి ఇన్నింగ్స్ నమోదు చేసి పెవిలియన్ చేరారు. మిడిలార్డర్‌లో వచ్చిన హార్దిక్(0) డకౌట్ అయినా.. ఇషాన్ కిషన్ (28) పరుగులతో పర్వాలేదనిపించాడు. దీంతో 152 పరుగుల వద్ద ముంబై 5 కీలక వికెట్లను కోల్పోయింది.

ఇదే సమయంలో ముంబై ఇండియన్స్ విజయానికి ఇంకా 11 పరుగులు చేయాల్సి ఉంది. ఇక 6-7 స్థానాల్లో క్రీజులో ఉన్న పొలార్డ్-కృనాల్ పాండ్యాను ఢిల్లీ బౌలర్లు కట్టడి చేసే ప్రయత్నం చేశారు. కానీ, చివరి ఓవర్లోనే విఫలం అయ్యారు. చివరి ఓవర్‌లో 7 పరుగులు చేయాల్సి ఉండగానే.. స్టోయినిస్ వేసిన తొలి బంతికే బౌండరీ కొట్టిన కృనాల్ పాండ్యా విజయానికి నాంది పలికాడు. ఆ తర్వాత ముంబై విజయం లాంఛనమైంది. కీరన్ పొలార్డ్ (11), కృనాల్ పాండ్యా (12) నాటౌట్‌గా నిలిచారు. 162 పరుగుల టార్గెట్ చేయాల్సి ఉండగా.. చివరి బంతిని కృనాల్ ఫోర్ కొట్టడంతో 19.4 ఓవర్లలో ముంబై 166 పరుగులు చేసి విజయం సాధించింది.

తొలి ఇన్నింగ్స్:

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ పర్వాలేదనిపించింది. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో గబ్బర్ తొడ కొట్టాడు. 52 బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్సర్ కొట్టి 69 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఓపెనర్ పృథ్వీ షా(4), అజింక్య రహనే(15) పరుగులకే వెనుదిరిగిన శిఖర్ దావన్ నిలకడగా రాణించాడు. గబ్బర్‌కు తోడుగా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(42) మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆ తర్వాత వచ్చిన స్టోయినిస్ (13) పరుగులు చేసి పెవిలియన్ చేరగా.. అలెక్స్ కారీ (14) పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో నిర్ధిష్ఠ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి ఢిల్లీ క్యాపిటల్స్ 162 పరుగులు చేసింది.

Delhi Capitals Innings: 162-4 (20 Ov)

1. పృథ్వీ షా c కృనాల్ పాండ్యా b బోల్ట్ 4(3)
2. శిఖర్ ధావన్ నాటౌట్ 69(52)
3. అజింక్య రహనే lbw b కృనాల్ 15(15)
4. శ్రేయస్ అయ్యర్ (c)c బోల్ట్ b కృనాల్ 42(33)
5.మార్క్యుస్ స్టోయినిస్ రనౌట్ (సూర్యకుమార్ యాదవ్/రాహుల్ చాహర్)13(8)
6. అలెక్స్ కారీ (wk) నాటౌట్ 14(9)

ఎక్స్‌ట్రాలు: 5

మొత్తం స్కోరు: 162

వికెట్ల పతనం: 4-1 (పృథ్వీ షా, 0.3), 24-2 (అజింక్య రహనే, 4.2), 109-3 (శ్రేయస్ అయ్యర్, 14.4), 130-4 (మార్క్యుస్ స్టోయినిస్ , 16.3)

బౌలింగ్:
ట్రెంట్ బోల్ట్ 4-0-36-1
జేమ్స్ ప్యాటిన్సన్ 3-0-37-0
జస్ప్రీత్ బుమ్రా 4-0-26-0
కృనాల్ పాండ్యా 4-0-26-2
కీరన్ పొలార్డ్ 1-0-10-0
రాహుల్ చాహర్ 4-0-27-0

Mumbai Indians Innings:

1. రోహిత్ శర్మ (c)c రబాడా b అక్సర్ 5(12)
2. క్వింటన్ డీ కాక్ (wk)c పృథ్వీ షా b అశ్విన్ 53(36)
3. సూర్య కుమార్ యాదవ్ c శ్రేయస్ అయ్యర్ b రబాడా 53(32)
4. ఇషాన్ కిషన్ c అక్సర్ b రబాడా 28(15)
5. హార్దిక్ పాండ్యా c అలెక్స్ కారీ b స్టోయినిస్ 0(2)
6. కీరన్ పొలార్డ్ నాటౌట్ 11(14)
7. కృనాల్ పాండ్యా నాటౌట్ 12(7)

ఎక్స్‌ట్రాలు: 4

మొత్తం స్కోరు: 166

వికెట్ల పతనం: 31-1 (రోహిత్ శర్మ, 4.6), 77-2 (క్వింటన్ డీ కాక్, 9.5), 130-3 (సూర్య కుమార్ యాదవ్, 14.6), 130-4 (హార్దిక్ పాండ్యా, 15.2)152-5 (ఇషాన్ కిషన్, 17.3)

బౌలింగ్:
కగిసో రబాడా 4-0-28-2
ఎన్రిచ్ నార్ట్జే 4-0-28-0
అక్సర్ పటేల్ 30241
రవి చంద్రన్ అశ్విన్ 40351
హర్షల్ పటేల్ 20200
మార్క్యుస్ స్టోయినిస్ 2.4-0-31-1



Next Story

Most Viewed