ముంబై ఇండియన్స్ టార్గెట్ -157

by  |
ముంబై ఇండియన్స్ టార్గెట్ -157
X

దిశ, వెబ్‌డెస్క్ : దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ జట్టు బొక్కబోర్లా పడింది. తొలి మూడు ఓవర్లలోనే కీలకమైన మూడు వికెట్లు కోల్పోయింది. ముంబై ఆటగాడు బౌల్ట్ అద్భుతమైన బౌలింగ్‌ వేసి రెండు వికెట్లు పడగొట్టాడు.

ఢిల్లీ ఆటగాళ్లలో ఓపెనర్లు స్టోయినిస్ 0(1) డక్కౌట్ అవ్వగా, శిఖర్ ధావన్ 15(13), అజింకా రహనే 2(4) మరోసారి నిరాశపరిచారు. దీంతో ఢిల్లీ జట్టు తొలి మూడు ఓవరల్లో‌నే 22 పరుగుల స్కోర్ వద్ద మూడు వికెట్లను కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో మునిగిపోయింది.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌, వికెట్ కీపర్ రిషబ్ పంత్ క్రీజులో కుదురుకునేందుకు ప్రయత్నించారు. స్ట్రైక్ రోటెట్ చేస్తూనే స్కోర్ బోర్డును పెంచేందుకు కృషి చేశారు. పంత్ తనదైన బ్యాటింగ్ చేస్తూ బంతులను రన్స్‌, బౌండరీలుగా మలిస్తూనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నెమ్మదిగా ఢిల్లీ స్కోర్ బోర్డు పెరుగుతున్న క్రమంలో కౌల్టర్ నైల్ బౌలింగ్‌లో పంత్ 56(38) భారీ షాట్‌కు యత్నించి హార్దిక్ కు దొరికిపోయాడు. దీంతో 15 ఓవర్ల వరకు ఢిల్లీ జట్టు 120-4 (15.4) పరుగులు చేసింది.

ఆ తర్వాత ఆరోస్థానంలో బ్యాటింగ్ దిగిన హిట్మయర్‌తో కలిసి అయ్యర్ హాఫ్ సెంచరీని పూర్తిచేసుకోగా, వెనువెంటనే హిట్మయర్ 5(5), అక్సర్ పటేల్ 9(9)పెవిలియన్ చేరారు. దీంతో ఢిల్లీ జట్టు ఏడు వికెట్ల నష్టానికి పరిమిత 20 ఓవర్లలో 156 పరుగులు చేయగలిగింది.

స్కోరు బోర్డు :

Delhi capital Innings :156-7 (20 Ov)

1. స్టోయినిస్ 0(1) c డికాక్ b బౌల్ట్
2. శిఖర్ ధావన్ 15(13)b జయంత్ యాదవ్
3. అజింకా రహానే 2(04) c డికాక్ b బౌల్ట్
4. రిషబ్ పంత్ 56(38) c హార్దిక్ పాండ్యా b కౌల్టర్ నైల్
5. హిట్మయర్ 5(5) c కౌల్టర్ నైల్ b బౌల్ట్
5. అయ్యర్ నాటౌట్ 65(50)
6. అక్సర్ పటేల్ 9(9)c అనుకుల్ రాయ్ b కౌల్టర్ నైల్
7.రబాడా నాటౌట్ 0(0) రన్ ఔట్

ఎక్స్‌ట్రాలు : 4

మొత్తం స్కోరు : 156

వికెట్ల పతనం : 0-1 (స్టోయినిస్, 0.1), 16-2 (అజింకా రహానే, 2.4) 23-3 (శిఖర్ ధావన్, 3.3), 118-4 (రిషబ్ పంత్, 14.6), 137-5 ( హిట్మయర్, 17.2) 149-6 (అక్సర్ పటేల్ ,19.2) 156-7( రబాడా, 20)

బౌలింగ్ :

1.ట్రెంట్ బౌల్ట్ 4-0-30-3
2. బుమ్రా 4-0-28-0
3. జయంత్ యాదవ్ 4-0-25-1
4. కౌల్టర్ నైల్ 4-0-29-2
5. కృనాల్ పాండ్యా 3-0-30-0
6. కిరోన్ పొలార్డ్ 1-0-13-0



Next Story

Most Viewed