వర్జినిటీ టెస్టుపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు.. రెండు వేళ్లతో కన్యత్వాన్ని ఎలా నిర్ధారిస్తారు..?

by  |
వర్జినిటీ టెస్టుపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు.. రెండు వేళ్లతో కన్యత్వాన్ని ఎలా నిర్ధారిస్తారు..?
X

దిశ, వెబ్‌డెస్క్: మహిళ కన్యత్వ పరీక్షలపై బాంబే హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక పిల్ విచారణ సందర్బంగా జరిగిన వాదోపవాదనలు విన్న న్యాయస్థానం వర్జీనిటీ టెస్ట్ నైతికమా..? కాదా ? అని ప్రశ్నించింది. ప్రస్తుతం న్యాయస్థానం చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. టూ ఫింగర్ టెస్టు లేదా కన్యత్వ పరీక్షల నైతికతపై సీరియస్​ ప్రశ్నలతో న్యాయవాది స్మిత సింగల్కర్​.. బాంబే హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్​) దాఖలు చేశారు. ఎంబీబీఎస్ రెండో సంవత్సరం సిలబస్ లో మహిళ కన్యత్వ పరీక్షల గురించిన అధ్యాయం ఉండగా.. అది మహిళలను కించపరిచేలా ఉందని, వారి మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ఆమె పిల్ లో పేర్కొన్నారు.

రెండు వేళ్ళతో మహిళలకు నిర్వహించే వర్జినిటీ టెస్టు నైతికమా అంటూ ప్రశ్నించారు. వర్జీనిటీ టెస్ట్ చేయాలంటే మహిళల జననాంగంలోకి రెండు వేళ్లను జొప్పించి పరీక్షిస్తారు. హైమన్ పొరను గుర్తించేందుకు వైద్యులు ఇలా చేస్తారు. దీని ఆధారంగా వారి కన్యత్వాన్ని నిర్దేశిస్తారు. అలా చేసినప్పుడు మహిళలకు తీవ్ర నొప్పిని భరించాల్సివస్తుంది. ఇంత హింసాత్మకంగా ఉండే ఈ టూ ఫింగర్ టెస్ట్ ని సిలబస్ నుంచి తొలగించాలని న్యాయస్థానాన్ని కోరారు.

వాదోపవాదనలు విన్న న్యాయస్థానం సంచలనం తీర్పునిచ్చింది. మహిళలకు నిర్వహించే వర్జినిటీ టెస్టు చేయడం నైతికమా.. కాదా అని వైద్య నిపుణుల అభిప్రాయాలను సమర్పించాలని ముంబై హైకోర్టు సూచించింది. స్మిత సింగల్కర్ వాదన చేశారే కానీ ఈ అంశాలను నిరూపించేలా ఎలాంటి మెటీరియల్​ను సింగల్కర్ సమర్పించలేదన్న కోర్టు ఈ అభ్యర్ధనను పరిగణలోకి తీసుకోవాలంటే ఆధారాలు ఉండాలని తెలిపింది. ఈ పిల్ గురుంచిన పూర్తి వివరాలు వైద్య నిపుణలు సమగ్రంగా రీసెర్చ్ చేసి అందివ్వాలని, వేరే దేశాలలో ఉన్న చట్టాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశిస్తూ ఈ కేసు విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది. ఇకపోతే కన్యత్వ పరీక్షలపై దేశంలో చాలా సందర్భాల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. కొన్ని మహిళా హక్కుల సంఘాలు కూడా ఈ టూ ఫింగర్ టెస్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు.


Next Story

Most Viewed