ముంబయి టెర్రర్ అటాక్ : సయీద్‌కు పదేళ్ల జైలు

by  |
ముంబయి టెర్రర్ అటాక్ : సయీద్‌కు పదేళ్ల జైలు
X

ఇస్లామాబాద్: ముంబయి టెర్రర్ అటాక్(26/11) మాస్టర్‌మైండ్, లష్కర్-ఎ-తాయిబా అనుబంధ ఉగ్రవాద సంస్థ జమాత్-ఉద్-దవా చీఫ్ హఫీజ్ సయీద్‌కు రెండు ఉగ్రవాద సంబంధ కేసుల్లో పాకిస్తాన్ కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఉగ్రకార్యకలాపాలకు ఆర్థిక సహకారం ఆరోపణలపై గతేడాది జులై 17న పాకిస్తాన్ పోలీసులు అరెస్టు చేశారు.

తీవ్రవాద వ్యతిరేక కోర్టు రెండు టెర్రర్ ఫైనాన్సింగ్ కేసుల్లో సయీద్‌కు ఫిబ్రవరిలో 11ఏళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన లాహోర్‌లోని హైసెక్యూరిటీ గల కోట్ లఖ్‌పత్ జైలులో ఉన్నారు. తాజాగా, లాహోర్‌లోని యాంటీ టెర్రర్ కోర్టు హఫీజ్ సయీద్ సహా నలుగురు జమాత్-ఉద్-దవా నేతలకు శిక్షలు ఖరారు చేసింది. ఐరాస గుర్తించిన టెర్రరిస్టుల జాబితాలో ఉన్న సయీద్ తలపై అమెరికా పది మిలియన్ డాలర్ల బౌంటీని ప్రకటించింది.



Next Story

Most Viewed