ఆ ప్లేస్ నాదే…మళ్లీ అగ్రస్థానంలో ముఖేశ్ అంబానీ!

by  |
ఆ ప్లేస్ నాదే…మళ్లీ అగ్రస్థానంలో ముఖేశ్ అంబానీ!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసియాలోనే అత్యంత సంపన్నుల జాబితాలో నిన్నటి వరకూ అలీబాబా గ్రూపు అధినేత జాక్ మా నంబర్ వన్ ప్లేస్‌లో ఉన్నారు. ఈ స్థానాన్ని జాక్ మా మార్చి నెలలో దక్కించుకున్నాడు. అయితే, అప్పటివరకూ ఉన్న ముఖేశ్ అంబానీ నెల తిరక్కుండా తన టాప్ ప్లేస్‌ను తిరిగి సంపాదించాడు. రిలయన్స్ జియోలో ఫేస్‌బుక్ సంస్థ 9.99 శాతం వాటాను బుధవారం కొనుగోలు చేసింది. అత్యంత విలువైన పెట్టుబడిగా జరిగిన ఈ ఒప్పందంతో ముఖేశ్ అంబానీ సంపద ఒక్కసారిగా 4.7 బిలియన్ డాలర్లు పెరిగి 49.1 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

నిన్నటి ఉదయం వరకు అలీబాబా గ్రూప్ అధినేత జాక్ మా 46 బిలియన్ డాలర్ల సంపదతో ఆసియాలోనే నంబర్ వన్ కుబేరుడిగా ఉండగా, నిన్నటి భారీ ఒప్పందం తర్వాత ముఖేశ్ అంబానీ 49.1 బిలియన్ డాలర్లతో మళ్లీ తొలిస్థానానికి వచ్చేశారు. రిల్యన్స్ ఇండస్ట్రీస్ తన డిజిటల్ విభాగాలన్నిటినీ ఏకం చేస్తూ జియో ప్లాట్‌ఫామ్స్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పుడు విబ్భాగాన్ని అతిపెద్ద డిజిటల్ సంస్థగా మార్చడానికి రిలయన్స్ సంస్థ కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌తో భారీ ఒప్పందం ద్వారా లక్ష్యాన్ని చేరుకుంటామని సంస్థ భావిస్తోంది.

Tags: Companies,Facebook,Facebook Jio Deal, Mark Zuckerberg, Mukesh Ambani, Reliance Jio

Next Story

Most Viewed