ఆ పథకం ద్వారా మూడేళ్లలో భారీగా ఉద్యోగాలు

by  |
ఆ పథకం ద్వారా మూడేళ్లలో భారీగా ఉద్యోగాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధానమంత్రి ముద్ర యోజన(పీఎంఎంవై) పథకం ప్రారంభించినప్పటి నుంచి రూ. 14.96 లక్షల కోట్ల విలువైన రుణాలను బ్యాంకులు, బ్యాంకింగ్ రహిత ఫైనాన్స్ సంస్థలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు మంజూరు చేశాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పథకం 2015-18 మధ్య కాలంలో మొత్తం 1.12 కోట్ల ఉద్యోగాలకు దోహదపడినట్టు ఆ శాఖ పేర్కొంది. ఇందులో 2020-21 ఆర్థిక సంవత్సరంలో మాత్రమే 4.20 కోట్ల పీఎంఎంవై రుణాలు మంజూరు అయ్యాయని, వీటి కింద గతనెల మార్చి 19 నాటికి రూ. 2.66 లక్షల కోట్లు పంపిణీ చేయబడినట్టు మంత్రిత్వ శాఖ పేర్కొంది. మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం… పీఎంఎంవై ద్వారా 2015 నుంచి 2018 వరకు మూడేళ్లలో 1.12 కోట్ల ఉద్యోగాలు కల్పించబడ్డాయి. ఇందులో 69 లక్షల మంది మహిళలు ఉన్నారని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది.


Next Story

Most Viewed