ఒకప్పుడు బాడీ షేమింగ్ ఎదుర్కొని.. ఇప్పుడు కుర్రాళ్లు గుండెలను కొల్లగొడుతున్న బ్యూటీ ఎవరంటే?

by Dishafeatures1 |
ఒకప్పుడు బాడీ షేమింగ్ ఎదుర్కొని.. ఇప్పుడు కుర్రాళ్లు గుండెలను కొల్లగొడుతున్న బ్యూటీ ఎవరంటే?
X

దిశ,సినిమా:సాధారణంగా సినీ పరిశ్రమలో బాడీ షేమింగ్ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తుంటాయి. కానీ ఇండస్ట్రీలో అడుగు పెట్టక ముందే కాలేజీ రోజుల్లోనే బాడీ షేమింగ్ కామెంట్స్ ఎదుర్కొనే వారు ఉన్నారు. వారిలో ఒకరు ఈ హీరోయిన్. ఆమె హీరోయిన్ గా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నప్పటికీ కాలేజి రోజుల్లో తన రూపం, శరీరాకృతి గురించి చాలా మంది అనేక రకాలుగా కామెంట్స్ చేస్తుండేవారట. ఇంతకీ ఆమె ఎవరనుకుంటున్నరా?..ఎవరో కాదండోయ్ జివి ప్రకాష్‌ కుమార్ నటించిన ‘బాచిలర్’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసి తన అందం, అభినయంతో తొలి సినిమాతోనే ఆడియన్స్ దృష్టిని ఆకర్షించిన దివ్య భారతి. ఈ అమ్మడు కోయంబత్తూర్ లో జన్మించింది.

అయితే తాను కాలేజీ రోజుల్లో తన బాడీ షేమింగ్ కామెంట్స్ ఎదుర్కొన్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అందులో భాగంగా 'కాలేజీలో నన్ను 'పాండా బాటిల్ సిస్టమ్', 'స్కెలిటన్', 'బట్ గర్ల్' పేర్లతో పిలిచేవారు. ఆ మాటలు నా పై తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో జనాల ముందు నడవడానికి కూడా భయపడ్డాను. మెల్లగా నా శరీరాన్ని నేనే అసహ్యించుకునేలా చేశాయి. ఆ తర్వాత 2015లో ఇన్‌స్టాగ్రామ్‌ లో నా ఫోటోస్ షేర్ చేశాను. నేను పోస్ట్ చేసిన ప్రతి ఫోటోకు మంచి కామెంట్స్ వచ్చాయి. బాడీ షేమింగ్ కామెంట్స్ వచ్చినప్పుడు.. మనల్ని మనం ఎలా ప్రేమించు కోవాలి అనే విషయాన్ని చెప్పడానికి ఆ రోజుల్లో నా వెంట ఎవరైనా ఉంటే బాగుండేది అనిపించింది' అంటూ చెప్పుకొచ్చింది దివ్య భారతి.

ప్రస్తుతం సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న ‘గోట్’ చిత్రంలో నటిస్తుంది.



Next Story

Most Viewed