Love Harmone: 'లవ్ హార్మోన్'.. ప్రేమకు కారణం కాదా?

by Disha Web Desk 10 |
Love Harmone: లవ్ హార్మోన్.. ప్రేమకు కారణం కాదా?
X

దిశ, ఫీచర్స్: సాధారణంగా ఒక అబ్బాయి మరో అమ్మాయితో బలమైన బంధం ఏర్పరుచుకోవాలంటే 'లవ్ హార్మోన్' అవసరమని గత అధ్యయనాలు తెలిపాయి. పిల్లలను కనాలన్నా, వారిని పెంచి పోషించాలన్నా 'ఆక్సిటోసిన్' కీలకమని గుర్తించారు. కానీ 'ప్రేమ హార్మోన్' అని పిలువబడే జీవసంబంధమైన గ్రాహకాన్ని కోల్పోయినా సరే సహచరులతో సంబంధాలు అలాగే ఉంటాయని తాజా అధ్యయనం స్పష్టం చేసింది.

సారూప్య జాతుల వలె కాకుండా 'ప్రేరీ వోల్స్' జీవితాంతం జతగా ఉంటాయి. ఇప్పటి వరకు జాతుల మధ్య ఏకస్వామ్యాన్ని ప్రోత్సహించడంలో ఆక్సిటోసిన్ కీలక పాత్ర పోషిస్తుందని భావించబడింది. కానీ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం పరిశోధకుల ప్రకారం.. ఆక్సిటోసిన్ లెవల్స్ తగ్గించినా సరే వోల్స్ వారి లైంగిక భాగస్వామితో చాలా బలమైన సామాజిక అనుబంధాన్ని ప్రదర్శించాయి. వయోజన జంతువులపై పరిశోధనలు నిర్వహించిన మనోలి అండ్ టీమ్.. ఇందుకోసం CRISPRని ఉపయోగించారు. ఇది జన్యు సంకేతాన్ని సవరించడానికి పరిశోధకులను అనుమతించే సాధనం. వోల్ పిండాలలో ఆక్సిటోసిన్ గ్రాహకానికి కోడ్ చేసే జన్యువులోని కొంత భాగాన్ని తొలగించి.. దానిని పనికిరానిదిగా మార్చారు. ఈ గ్రాహకాన్ని ఉత్పత్తి చేయని ప్రేరీ వోల్స్ ఆక్సిటోసిన్ ఉనికిని గుర్తించలేవు, ప్రతిస్పందించలేవు. కాబట్టి ఆక్సిటోసిన్ జీవిత భాగస్వామి, తల్లిదండ్రుల ప్రేమకు మేక్ లేదా బ్రేక్ అయితే.. ప్రేమలేని వోల్ వివాహాలు, నిర్లక్ష్యం చేయబడిన పిల్లలను చూడాల్సి ఉంటుంది. కానీ దీనికి విరుద్ధంగా ఈ గ్రాహకం లేని ప్రేరీ వోల్స్‌లో పెయిర్-బాండింగ్ ప్రవర్తనలు, నర్సింగ్, పప్ ఈనినింగ్ సంభవించినట్లు పరిశోధకులు గమనించారు.

ఈ పరిశోధనలు తదుపరి అధ్యయనాలలో పరీక్షించవలసిన విలోమ సత్యాన్ని కూడా సూచిస్తున్నాయి. ఆక్సిటోసిన్‌కు ప్రతిస్పందించే సామర్థ్యం లోపిస్తే.. వోల్స్ సామాజిక అనుబంధాలను ఏర్పరుచుకోకుండా ఉంటాయి. కానీ అది ఇక్కడ జరగలేదు. అంటే ఒక జీవికి అదనపు ఆక్సిటోసిన్ ఇవ్వడం వలన బంధం ఏర్పడదు. తగ్గించడం వలన తుంచివేయబడదు. మొత్తానికి వోల్స్ నిస్సహాయ ప్రదేశంలో ప్రేమను కనుగొన్నాయని.. ఇది ప్రేమకున్న శక్తి అని నమ్ముతున్నామని ముగించారు పరిశోధకులు.

ఇవి కూడా చదవండి:

నెపోటిజంపై షాకింగ్ కామెంట్స్ చేసిన Janhvi Kapoor !



Next Story

Most Viewed