Samantha : వాటితోనే ప్రపంచాన్ని మార్చగలం.. సమంత ఆసక్తికర పోస్ట్

by Disha Web Desk 6 |
Samantha : వాటితోనే ప్రపంచాన్ని మార్చగలం.. సమంత ఆసక్తికర పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎన్నో చిత్రాల్లో స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. అయితే ఈ అమ్మడు ఇటీవల విజయ్ దేవరకొండ ఖుషి సినిమాతో పలకరించింది. ఆ తర్వాత మయోసైటీస్ వ్యాధి తిరగబడటంతో మూవీస్‌కు బ్రేక్ ఇచ్చింది. విదేశాల్లో ట్రీట్‌మెంట్ తీసుకుంటూ పలు విషయాలపై స్పందిస్తుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన గ్లామరస్ ఫొటోస్ షేర్ చేస్తోంది.

కొన్నేళ్ల క్రితమే ప్రత్యూష సపోర్ట్ అనే స్వచ్చంద సేవా సంస్థ ఏర్పాటు చేయించి చిన్నారులకు వైద్య సేవలు అందిస్తోంది. అయితే ఇటీవల సమంత చిన్నపిల్లల స్కూల్‌లో సందడి చేసింది. వారితో కలిసి సరదాగా ముచ్చటించింది. తాజాగా, సామ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. ‘‘ఒక పుస్తకం, పెన్ను, పిల్లాడు, టీచర్ మాత్రమే ఈ ప్రపంచాన్ని మార్చగలరు’’ అంటూ రాసుకొచ్చింది. అలాగే చిన్న పిల్లలతో కలిసి ఉన్న ఫొటోస్ షేర్ చేసింది. ప్రస్తుతం ఆమె పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో అది చూసిన నెటిజన్లు ఆమెను పొగిడేస్తున్నారు.



Next Story

Most Viewed