విజయ్ ‘లియో’.. తెలుగు రైట్స్ రేట్‌ ఎన్ని కోట్లో తెలుసా?

by samatah |   ( Updated:2023-06-22 06:34:04.0  )
విజయ్ ‘లియో’.. తెలుగు రైట్స్ రేట్‌ ఎన్ని కోట్లో తెలుసా?
X

దిశ, సినిమా: దళపతి విజయ్ హీరోగా, లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘లియో’. ఈ మూవీ కోసం కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్ సినీ ల‌వ‌ర్స్ సైతం అత్యంత‌ ఆస‌క్తిక‌రంగా ఎదురుచూస్తున్నారు. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ పూర్తికాక‌ముందే థియేట్రిక‌ల్‌, ఓటీటీ, శాటిలైట్ రైట్స్ బిజినెస్ దాదాపు క్లోజ్ అయ్యాయట. ఇందులో భాగంగా ఈ మూవీకి తెలుగు థియేట్రిక‌ల్ రైట్స్ కోసం నిర్మాత‌లు 27 కోట్ల వ‌ర‌కు డిమాండ్ చేస్తున్నట్లు స‌మాచారం. ఇక వారు డిమాండ్ చేసినంతగా మొత్తం చెల్లించ‌డానికి రెండు మూడు టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. విజయ్‌కి తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కనుక సినిమా హిట్ అవుతుందని నిర్మాతలు నమ్ముతున్నారు.

Read More... పూజను చిక్కుల్లో పడేస్తున్న ముగ్గురు హీరోయిన్స్ .. ఎలా అంటే?

Advertisement

Next Story