కచ్చితంగా లవ్ మ్యారేజే చేసుకుంటా.. తన మనసులో మాట చెప్పేసిన విజయ్ దేవరకొండ

by Disha Web Desk 7 |
కచ్చితంగా లవ్ మ్యారేజే చేసుకుంటా.. తన మనసులో మాట చెప్పేసిన విజయ్ దేవరకొండ
X

దిశ, సినిమా: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, బ్యూటిఫుల్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న సినిమా ‘ఫ్యామిలీ స్టార్’. ఇందులో నుంచి ఇప్పటికే రిలీజైన టైటిల్ లుక్, గ్లింప్స్, టీజర్, సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసిన విషయం తెలిసిందే. ఇక పరశురామ్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ.. ఏప్రిల్ 5న థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. దీంతో వరుస ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు మూవీ టీం. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ సినిమా గురించి, తన పర్శనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

విజయ్ మాట్లాడుతూ.. ‘‘ఫ్యామిలీ స్టార్’ మూవీ కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుంది. ఎందుకంటే ఇది యూనివర్సల్ కంటెంట్‌తో రూపుదిద్దుకుంది. ఏప్రిల్ 5న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. అలాగే.. రెండు వారాల తర్వాత హిందీ, మలయాళంలో రిలీజ్ చేయనున్నాం. ఈ మూవీని తప్పకుండా ఆధారిస్తారని ఆశిస్తున్నాను’ అని చెప్పుకొస్తూనే.. ‘నాకు పెళ్లి చేసుకోవాలని, పిల్లల్నీ కనాలని ఉంది. కానీ దానికి ఇంకా టైం పడుతోంది. అయితే లవ్ మ్యారేజే చేసుకుంటాను. ఆ అమ్మాయి మా తల్లిదండ్రులకు కూడా నచ్చాలి’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.


Next Story