కుక్కతో పెళ్లి.. దీపిక గురించి ట్వింకిల్ ఖన్నా వైరల్ పోస్ట్.. ఇంతలోనే డిలీట్

by Disha Web Desk 7 |
కుక్కతో పెళ్లి.. దీపిక గురించి ట్వింకిల్ ఖన్నా వైరల్ పోస్ట్.. ఇంతలోనే డిలీట్
X

దిశ, సినిమా: బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె, భర్త రణ్‌వీర్ సింగ్ తో కలిసి రీసెంట్ గా ‘కాఫీ విత్ కరణ్’ షో పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే ఈ షోలో భాగంగా దీపిక నలుగురైదుగురితో డేటింగ్ చేశానన్నట్టుగా చెప్పింది. ‘గత అనుభవాల నుంచి బయటకు వచ్చేందుకు మధ్యలో కొన్నేళ్లు సింగిల్‌గా ఉండాలని అనుకున్నా. ఆ టైంలోనే రణ్‌వీర్ ప్రపోజ్ చేశాడు. అప్పుడు రణ్‌వీర్‌కు నేను కమిట్ అయ్యాను’ అని దీపిక చెప్పింది. అలా ఈ అమ్మడు డేటింగ్ లిస్ట్ లో రణబీర్, ధోనీ, యువరాజ్, సిద్ధార్థ్ మాల్యా ఉన్నట్లుగా తెలిపింది. అయితే దీపిక మాటలపై నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేశారు.

కాగా ఇదే విషయంపై తాజాగా నటి ట్వింకిల్ ఖన్నా స్పందిస్తూ వైరల్ పోస్ట్ చేసింది.. ‘పెళ్లికి ముందు కుక్కలు, చెట్లతో పెళ్లి చేస్తే ఏమి రాదు.. ఈ కల్చర్ వదిలేసి దీపిక లాగా ఇద్దరు, ముగ్గురిని ట్రై చేసి.. ఫైనల్ గా ఒకరిని సెలెక్ట్ చేసుకుని పెళ్లి చేసుకుంటే బెటర్’ అని ట్వింకిల్ తన అభిప్రాయం వ్యక్తం చేసింది. కారణమేంటో తెలియదు కానీ వెంటనే పోస్ట్‌ను తొలగించింది ట్వింకిల్.

Next Story