టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నటుడు మృతి

by Disha Web Desk 7 |
టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నటుడు మృతి
X

దిశ, సినిమా: ఇండస్ట్రీలో వరుస విషాదాలు జరుగుతున్నాయి. బుల్లితెర, వెండితెర అనే తేడా లేకుండా ఎన్నో పాత్రల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు వీరభద్రరావు చనిపోయారు. రెండు నెలల క్రితం ప్రమాదవశాత్తూ కింద పడిపోయిన ఆయన.. అప్పటి నుంచి కోమాలోనే ఉన్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. టీవీ సీరియల్స్, సినిమాలు ఎన్నో పాత్రలు చేసిన ఆయన మరణం పట్ల సినీ ప్రముఖుల, టీవీ నటులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. అతని ఫ్యామిలీకి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.


Next Story