రష్మిక స్థానంలో రాశీ ఖన్నా.. నితిన్‌కు హీరోయిన్ దొరికినట్లేనా?

by Dishafeatures2 |
రష్మిక స్థానంలో రాశీ ఖన్నా.. నితిన్‌కు హీరోయిన్ దొరికినట్లేనా?
X

దిశ, సినిమా : టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ అందరికీ సుపరిచితమే. కొంత కాలం ఇతని సినిమాలకు గ్యాప్ వచ్చినప్పటికీ ప్రజెంట్ క్రేజీ డైరెక్టర్స్‌తో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో, పవన్ కల్యాణ్ సినిమా అయినటువంటి ‘తమ్ముడు’ టైటిల్‌తోనూ ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ స్పీడప్‌లో ఉంది. అంతేకాకుండా వెంకీ కడుముల దర్శకత్వంలో కూడా మరో సినిమా చేస్తున్నాడు నితిన్. దీనికి రాబిన్ హుడ్ అనే టైటిల్ డిసైడ్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతా బాగానే ఉంది. ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు? అనే విషయంలోనే ఇప్పటి వరకైతే క్లారిటీ లేదు.

కాగా రాబిన్ హుడ్ మూవీలో నితిన్‌కు జోడీగా హీరోయిన్ రష్మికా మందన్నను తీసుకోవాలని ముందుగా అనుకున్నారు. షూటింగ్ అయితే ప్రారంభించారు కానీ పలు కారణాలవల్ల రష్మిక మందన్న ఈ మూవీ నుంచి తప్పుకుంది. ఆ తర్వాత ఏం జరిగింది? కొత్త హీరోయిన్‌‌ను తీసుకున్నారా? అనే విషయంలో మూవీ యూనిట్ మాత్రం ఎప్పుడూ అఫీషియల్‌గా ప్రకటించలేదు.

ఇకపోతే తాజాగా నితిన్ నటిస్తున్న రాబిన్ హుడ్ మూవీకి సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అతనికి జోడీగా రష్మిక మందన్న స్థానంలో రాశీ ఖన్నాను రీ ప్లేస్ చేశారన్న వార్తలు వినిపిస్తు్నాయి. కొందరు ఇది రూమర్స్ అని భావిస్తుండగా మరికొందరు నిజమే అని నమ్ముతున్నారు. ఎందుకంటే నితిన్, రాశి ఖన్నా జోడీపై ఇప్పటికే పాజిటివ్ అంచానాలు ఉన్నాయి. వీరిద్దరూ ఇప్పటికే శ్రీనివాస కళ్యాణం సినిమాలో కలిసి నటించారు. ఇప్పుడు మరోసారి జోడీగా నటించేందుకు రెడీగా ఉన్నట్లు సమాచారం. అయితే మూవీ యూనిట్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ మాత్రం ఇంకా రావాల్సి ఉంది.

Next Story

Most Viewed