టైటానిక్ మూవీలో రోజ్‌ను కాపాడిన డోర్ వేలం ఎన్ని కోట్లకు అమ్ముడుపోయిందో తెలిస్తే షాక్

by Disha Web Desk 9 |
టైటానిక్ మూవీలో రోజ్‌ను కాపాడిన డోర్ వేలం ఎన్ని కోట్లకు అమ్ముడుపోయిందో తెలిస్తే షాక్
X

దిశ, సినిమా: హాలీవుడ్ స్టార్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన గొప్ప ప్రేమ కథ ‘టైటానిక్’ చిత్రం. ఈ టైటిల్ చూడగానే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది టైటానిక్ మునిగిపోయిన ఘటన. ప్రపంచం ఎప్పటికీ మర్చిపోలేని విషాద ఘటన ఇది. ఈ భయంకర ప్రమాదంలో వందలాది మది ప్రాణాలు నీటిలో కలిసిపోయాయి.

ఈ ఘటన ఆధారంగానే 1997 లో టైటానిక్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు జేమ్స్. దాదాపు 1500 మంది మృత్యువాత పడిన విషాద ఘటన తో పాటు బ్యూటిఫుల్ లవ్ స్టోరీని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఈ స్టోరీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చిత్రంలో లియోనార్డో డికాప్రియో, కేట్ విన్స్లెట్ హీరో-హీరోయిన్ గా నటించి.. యువతను బాగా ఆకట్టుకున్నారు. ఈ మూవీ ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకుంది.

అయితే ఇందులో రోజ్ ప్రాణాలు కాపాడి తలుపును వేలం వేసినట్లు సమాచారం. ఆ ఫ్లోటింగ్ డోర్ ఏకంగా 718, 750 డాలర్లకు అమ్ముడుపోయిందట. అంటే సుమారు రూ. 6 కోట్లు అన్నమాట. అలాగే ఆ సీన్‌లో రోజ్ ధరించిన షిఫాన్ దుస్తులు కూడా 125,000 డాలర్లకు అమ్ముడుపోయాయట. అంటే (1,04,17,143.75) రూ.1 కోటికి పైగా. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.


Next Story