మహిళల గురించి పచ్చి నిజాలు మాట్లాడిన ఇంద్రజ.. స్పీచ్ వైరల్

by Disha Web Desk 6 |
మహిళల గురించి పచ్చి నిజాలు మాట్లాడిన ఇంద్రజ..  స్పీచ్ వైరల్
X

దిశ, సినిమా: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓ కంపెనీ నెలసరి సమయంలో మహిళలకు ఉపయోగపడే ప్రత్యేక ప్రొడక్ట్‌ను మార్కెట్‌లో లాంచ్‌ చేసింది. సీనియర్ నటి ఇంద్రజ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడిన మాటలు అందరినీ ఆలోచనలో పడేలా చేశాయి. ‘‘మరో రెండు రోజుల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోనున్నాం. మనకు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా.. ఇంకా ఆడా, మగా సమానం అనే భావన రాలేదు.

కానీ కొన్నిచోట్ల నేటితరం మహిళలు కూడా మగవారితో సమానంగా ప్రతీ రంగంలో పోటీ పడుతున్నారు. అంతరిక్షంలోకి సైతం అడుగుపెట్టారు. కానీ మన దగ్గర మాత్రం మహిళలకు కనీసం 30 శాతం సమాన అవకాశం ఇవ్వడానికి కూడా మగవారికి మనసు రావడం లేదు. ఇప్పటికీ చాలా మంది మహిళలు రకరకాల సమస్యలు ఎదొర్కొంటున్నారు. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి.. మన సమస్యలు పదే పదే మగవారికి చెప్పుకోవడంవల్ల, వారిలో ఎలాంటి మార్పూ ఉండదు. ఓపికగా భరించడం నేర్చుకోండి. అప్పుడు వారికే తెలిసొస్తుంది’’ అంటూ చెప్పుకొచ్చింది ఇద్రజ.

Next Story

Most Viewed