'శర్మాజీ కి బేటీ' కోసం భర్త దగ్గరే అప్పుచేశా: Tahira Kashyap

by Hajipasha |
శర్మాజీ కి బేటీ కోసం భర్త దగ్గరే అప్పుచేశా: Tahira Kashyap
X

దిశ, సినిమా : 'ఎవరి జీవితం పరిపూర్ణం కాదు! ప్రతి వ్యక్తి జీవితంలో ఏదైనా సాధించాలంటే సవాళ్లను ఎదుర్కోవాలి. నా లైఫ్ కూడా ఇందుకు మినహాయింపు కాదు' అంటోంది తాహిరా కశ్యప్. ప్రస్తుతం గోవాలోని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IIFI) సెషన్‌కు హాజరైన ఆమె కెరీర్ తొలి రోజులను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయింది. తన దర్శకత్వంలో తెరకెక్కిన మొదటి చిత్రం 'శర్మాజీ కి బేటీ' కోసం తన భర్త, నటుడు ఆయుష్మాన్ ఖురానా నుంచి డబ్బు అప్పుగా తీసుకున్నట్లు గుర్తుచేసుకుంది.

'నా జీవితంలో వివిధ ఉద్యోగాలను ఎంచుకున్నా. కార్పొరేట్ రంగం, టీచింగ్, రేడియో ఈవెంట్‌లు. కానీ, చివరగా సృజనాత్మకత కలిగిన ఉద్యోగం కథలు చెప్పడమే. ఇది ఎంచుకున్న తర్వాత సంతోషంగా ఉన్నా. ఈ క్రమంలో నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చేయడానికి భర్త నుంచి మనీ తీసుకున్నా. నేను ఇలా ఉండాలనుకుంటున్నానని కూడా వివరించి.. దీంతో పెద్దగా డిస్కస్ చేయకుండా ఆ చిన్న ఓపెనింగ్‌కు సహకరించాడు. ఈ విధమైన పుష్ ప్రతి మహిళకు అవసరం. ఆయుష్మాన్ పట్ల ఎల్లపుడూ కృతజ్ఞురాలిని' అంటూ చెప్పుకొచ్చింది తాహిరా.

ఈ క్షణం కోసం నాలుగు దశాబ్దాలు ఎదురుచూశా: చిరంజీవి (వీడియో)

Next Story

Most Viewed