మహేష్ బాబు బ్లాక్ టికెట్ల కహానీ.. అంత పేరున్నా ఎందుకీ పని చేశాడు.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే..

by Dishafeatures3 |
మహేష్ బాబు బ్లాక్ టికెట్ల కహానీ.. అంత పేరున్నా ఎందుకీ పని చేశాడు.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే..
X

దిశ, సినిమా : సూపర్ స్టార్ మహేష్ బాబు తండ్రికి తగిన తనయుడు అనిపించుకున్నాడు. హాలీవుడ్ హీరో పర్సనాలిటీతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. సీనియర్ హీరో కృష్ణ వారసుడిగా బాల నటుడిగానే ఎంట్రీ ఇచ్చిన ప్రిన్స్.. చైల్డ్ హుడ్ లోనే వెండితెరపై సత్తా చాటాడు. అయితే చెన్నైలోనే పెరిగిన ఆయన.. కొత్త సినిమాలు వచ్చిందంటే థియేటర్ ముందు దర్శనం ఇచ్చేవాడట. ఒకవేళ టికెట్లు దొక్కపోతే.. బ్లాక్ లో కొని మరీ మూవీ చేసేవాడట. ముఖ్యంగా రంగీలా సినిమా టికెట్ కోసం చాలా ఇబ్బంది పడ్డానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అంతేకాదు రజనీకాంత్, కమల్ హాసన్ సినిమాలు ఎక్కువగా చూసేవాడినని.. అందరితో కలిసి చూస్తే ఆ కిక్కే వేరని అన్నాడు.సూపర్ స్టార్ మహేష్ బాబు తండ్రికి తగిన తనయుడు అనిపించుకున్నాడు. హాలీవుడ్

అయితే సూపర్ స్టార్ కృష్ణ కొడుకు అయిన మహేష్ కావాలనుకుంటే ఇంటికే టికెట్స్ వచ్చేవి కానీ అలా కాకుండా చాలా సింప్లిసిటీతో పెరిగారని ఈ సంఘటనలు వింటుంటే అర్థం అవుతుంది. అందుకే ఈ రాజకుమారుడికి ఫిదా అయిపోయామని అభిమానులు చెప్తున్నారు. కాగా త్వరలో జక్కన్నతో చేస్తున్న ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుండగా.. ఫ్యాన్స్ వెయిటింగ్.

Next Story

Most Viewed