కొత్త సినిమా ప్రకటించిన స్టార్ హీరో సూర్య పోస్టర్ రిలీజ్.. అస్సలు ఊహించలేదంటూ నెటిజన్ల కామెంట్స్

by Disha Web Desk 6 |
కొత్త సినిమా ప్రకటించిన స్టార్ హీరో సూర్య పోస్టర్ రిలీజ్.. అస్సలు ఊహించలేదంటూ నెటిజన్ల కామెంట్స్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య వరుస చిత్రాల్లో నటిస్తూ దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం శివ దర్శకత్వంలో ‘కంగువ’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇందులోంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ భారీ అంచనాలను పెంచేశాయి. ఇది పిరియాడిక్ మూవీగా రాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో సూర్య ఫ్యాన్స్ కంగువ రిలీజ్ కోసం ఇగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, సూర్య తన ట్విట్టర్ వేదికగా 44వ సినిమాను ప్రకటించాడు.

అంతేకాకుండా ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు. ఈ పోస్టర్ ఓ చెట్టుమీద హార్ట్ బ్రేక్ అయినట్లుగా ఉంది. అంతేకాకుండా లవ్‌తో పాటు, కామెడీ, యాక్షన్ సీన్స్ ఉంటాయని హింట్ ఇచ్చాడు. కాగా.. ఈ చిత్రానికి తమిళ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం. ఈ పోస్టర్ చూసిన సూర్య ఫ్యాన్స్ ఈ కాంబోను అస్సలు ఊహించలేదని కామెంట్స్ పెడుతున్నారు.


Next Story

Most Viewed