ఆ వ్యాధితో బాధపడుతున్న స్టార్ బ్యూటీ అలియా..ప్రతి వారం ఆసుపత్రికి వెళ్లాల్సిందే!

by Disha Web Desk 8 |
ఆ వ్యాధితో బాధపడుతున్న స్టార్ బ్యూటీ అలియా..ప్రతి వారం ఆసుపత్రికి వెళ్లాల్సిందే!
X

దిశ, సినిమా :ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయంతో ఎంతో మందిని ఆకట్టుకుంది ఈ నటి. ఇక త్రిబుల్ ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన ఈ నటి. బాలీవుడ్‌లో వరస సినిమాలు చేస్తూ..స్టార్ హీరోయిన్ హోదా సంపాదించుకుంది.

అయితే తాజాగా అలియాకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది ఏమిటంటే. ఈ బ్యూటీ ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా అదే అందాన్ని మెటైన్ చేస్తూ వస్తుంది. అయితే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె, తాను శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి గల కారణాలు తెలిపింది.

రణబీర్ కపూర్‌ను పెళ్లిచేసుకొని, అలియా రహాకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే పాప పుట్టిన తర్వాత తాను ఆరోగ్యం విషయంలో చాలా కేర్‌ఫుల్‌గా ఉండేదంట. ఆమె మాట్లాడుతూ..బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత శరీరంలో అనేక మార్పులు వస్తుంటాయి. హీరోయిన్స్ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా ఒక పక్క సినిమాల్లో నటిస్తూ.. మరోపక్క బిడ్డ గురించి చాలా ఆలోచించాల్సి వస్తుస్తుంది. నా బిడ్డ బాధ్యతలు సరిగా నిర్వహిస్తున్నానా లేదా అనే భయాలు ప్రతిక్షణం నన్ను వెంటాడుతూనే ఉంటాయి.. అది మానసిక ఆరోగ్యంపై పై ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే మానసికంగా ఆరోగ్యంగా ఉండేదుకు ప్రతి వారం ఆసుపత్రికి వెళ్లి, థెరఫీ తీసుకుంటానని చెప్పింది. మానసిక ఒత్తిడి నుంచి బయటపడవచ్చునని పేర్కొంది.



Next Story

Most Viewed

    null