డాక్టర్‌తో ప్రేమలో పడ్డ శ్రీలీల.. పెళ్లికి కూడా తల్లి గ్రీన్ సిగ్నల్!

by Anjali |
డాక్టర్‌తో ప్రేమలో పడ్డ శ్రీలీల.. పెళ్లికి కూడా తల్లి గ్రీన్ సిగ్నల్!
X

దిశ, వెబ్‌డెస్క్: అతిపిన్న వయస్సులో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది యంగ్ బ్యూటీ శ్రీలీల. ప్రస్తుతం అగ్రహీరోల సరసన నటిస్తూ కోట్లలో రెమ్యునరేషన్ అందుకుంటోంది. ఇక ఈ అమ్మడు దూకుడు చూస్తుంటూ సీనియర్ హీరోయిన్లు సైతం భయపడిపోతున్నారు. అంతేకాకుండా దర్శక, నిర్మాతలు కూడా ఈ భామనే తమ సినిమాల్లో హీరోయిన్‌గా ఎంపిక చేసుకుంటున్నారు. అయితే శ్రీలీల గురించి నెట్టింట ఓ వార్త తెగ వైరల్‌గా మారింది. ఈమె లవ్‌లో పడిందని, ఆమె ప్రేమిస్తున్న వ్యక్తి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు కాదని, తన చిన్ననాటి మిత్రుడైన డాక్టర్‌తో లవ్‌లో ఉందని, పెళ్లి కూడా అతడినే చేసుకుంటుందని ప్రచారం జరుగుతోంది. కాగా ఈ విషయం శ్రీలీల తన తల్లికి కూడా చెప్పిందట. ఆమె ఫస్ట్‌లో కాస్త కోపానికి గురైనా.. కుమార్తె ప్రేమలో ఉన్న సిన్సియారిటీని చూసి వాళ్లిద్దరి లవ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం.

Read More: చివరి నిమిషంలో అమెరికా టూర్ క్యాన్సిల్ చేసుకున్న సమంత.. ఆ కోరిక తీర్చుకోవడానికేనా?

Next Story

Most Viewed