శ్రీరామ నవమి స్పెషల్.. జై హనుమాన్ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్.. ఈ సారి గూస్ బంప్స్ పక్కా!

by Disha Web Desk 6 |
శ్రీరామ నవమి స్పెషల్.. జై హనుమాన్ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్.. ఈ సారి గూస్ బంప్స్ పక్కా!
X

దిశ, సినిమా: డైరెక్టర్ ప్రశాంత్ వర్మ- తేజా సజ్జా కాంబోలో వచ్చిన ‘హనుమాన్’ సినిమా సూపర్ హిట్ టాక్ అందుకున్న విషయం తెలిసిందే. చిన్న చిత్రంగా వచ్చినప్పటికీ ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటుగా భారీగా కలెక్షన్స్ రాబట్టి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. పెద్ద హీరోల సినిమాలను సైతం దాటేసి ఇండియా వైడ్‌గా ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. అయితే దర్శకుడు ఇప్పటికే హనుమాన్ సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లు ప్రకటించాడు. అలాగే జై హనుమాన్ పేరుతో తెరకెక్కించబోతున్నట్లు ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశాడు. దీంతో సినీ ప్రియుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఎప్పుడెప్పుడు జై హనుమాన్ షూటింగ్ స్టార్ట్ అవుతుందా.. రిలీజ్ ఎప్పుడు చేస్తారా అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో.. తాజాగా, ప్రశాంత్ వర్మ నేడు శ్రీరామ నవమి సందర్భంగా ప్రేక్షకులకు జై హనుమాన్‌కు సంబంధించిన అప్డేట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశాడు. అంతేకాకుండా ‘‘ప్రతి ఒక్కరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ పవిత్ర సందర్భంగా శ్రీరాముడి దివ్య ఆశీర్వాదంతో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరికీ ఇది నా వాగ్దానం. మునుపెన్నడూ లేని అనుభూతిని & జీవితకాలం జరుపుకునే చలన చిత్రాన్ని మీకు అందిస్తాను. ఇది మీ అందరికీ ప్రత్యేకం కానుంది’’ అంటూ రాసుకొచ్చాడు. దీంతో కొందరు నెటిజన్లు పోస్టర్ చూస్తేనే అర్థం అవుతోంది. ఈ సారి గూస్ బంప్స్ రావడం పక్కా అని కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం.. దేవుని పేరు చెప్పుకొని డబ్బులు సంపాదిస్తున్నావ్ మంచి సినిమా చేయమని అంటున్నారు.

Next Story

Most Viewed