నాగచైతన్యకు షాకిచ్చిన శోభితా.. హోటల్‌లో అతడితో అడ్డంగా బుక్!

by Disha Web Desk 6 |
నాగచైతన్యకు షాకిచ్చిన శోభితా.. హోటల్‌లో అతడితో అడ్డంగా బుక్!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శోభితా ధూళిపాల మేజర్ మూవీతో అలరించింది. అయితే గత ఏడాది నుంచి నాగచైతన్యతో ఎఫైర్ నడిపిస్తున్న కొన్ని రోజుల నుంచి వార్తలు వైరల్ అయ్యాయి. శోభిత ధూళిపాళ్లతో సన్నిహితంగా ఉంటున్నారు. ఆమెను తరచుగా కొత్తగా నిర్మిస్తున్న ఇంటికి తీసుకొస్తున్నాడు నెట్టింట చర్చలు జరిగాయి. వాటిపై నాగచైతన్య స్పందించి అవన్నీ నిజాలు కాదని తేల్చి చెప్పాడు. కానీ కొన్ని రోజులకే చై విదేశాల్లో కలిసి తిరుగుతున్నట్లు ఓ ఫొటో బయటకు వచ్చింది. ఇందులో ఇద్దరు పక్కన పక్కన నిల్చుని కనిపించడంతో అంతా నిజమే అనుకున్నారు. లండన్ వెళ్లిన నాగ చైతన్య, శోభిత... ఇండియన్ రెస్టారెంట్ ని సందర్శించారు. అందులో పని చేసే చెఫ్ నాగ చైతన్యతో సెల్ఫీ దిగాడు.

ఆ ఫోటోలో శోభిత ధూళిపాళ్ల కూడా కవర్ అయ్యింది. లండన్ కి జంటగా వెళ్లారని వార్తలు రావడంతో చెఫ్ తన ఫొటోలను సోషల్ మీడియా నుంచి డిలీట్ చేశాడు. అది కూడా చై చెబితే తొలగించినట్లు టాక్. ఇదిలా ఉండగా.. తాజాగా, శోభితా ముంబైలో ఓ రెస్టారెంట్ నుండి ఓ యువకుడితో అడ్డంగా దొరికిపోయింది. ఇద్దరు బయటకు వస్తుండగా శోభితను మీడియా చుట్టుముట్టింది. అయినా వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా హడావిడిగా అక్కడి నుంచి వెళ్లి పోయిందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో అసలు ఆ వ్యక్తి ఎవరు ఎందుకు మీడియా ముందుకు రాలేదని చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా నాగచైతన్యకు ఇది బిగ్‌షాక్ అంటూ అభిప్రాయపడుతున్నారు.






Next Story

Most Viewed