పాప రొమాంటిక్ అనుకుంటా.. 'DDLJ' చూపించండి : షారుఖ్

by Disha Web |
పాప రొమాంటిక్ అనుకుంటా.. DDLJ చూపించండి : షారుఖ్
X

దిశ, సినిమా: నాలుగేళ్ల విరామం తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చిన షారుఖ్ 'పఠాన్' విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. అయితే ఈ మూవీ రిలీజ్‌కు ముందునుంచే ట్విట్టర్ వేదికగా అభిమానులతో టచ్‌లో ఉంటూ అలరిస్తు్న్న ఆయన తాజాగా తన మూవీపై ఓ పాప చేసిన కామెంట్‌కు అదిరిపోయే ఆన్సర్ చెప్పి నవ్వులు పూయించాడు. విషయానికొస్తే.. అభిషేక్ కుమార్ అనే ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేసిన వీడియోలో ఓ పాపను 'రీసెంట్‌గా నువ్వు ఏ సినిమా చూశావ్? అన్ని ప్రశ్నించగా 'పఠాన్' అని క్యూట్‌గా ఆన్సర్ చెప్పింది. 'మరి నీకు సినిమా నచ్చిందా?' అని అడగగానే 'హు హు' అంటూ నచ్చలేదని చెప్పేసింది'. కాగా వైరల్ అవుతున్న వీడియోపై తనదైన స్టైల్‌లో రియాక్ట్ అయిన బాద్‌షా.. 'ఓహో! ఇప్పుడు నేను మరింత కష్టపడాలి. బ్యాక్ టూ ది డ్రాయింగ్ బోర్డు. యువ ప్రేక్షకులను డిజప్పాయింట్ చేయలేను. దేశ్ కే యూత్ కా సవాల్ హై. దయచేసి ఆమెపై DDLJని ప్రయత్నించండి. బహుశా ఆమె రొమాంటిక్ కిడ్ కావొచ్చు. పిల్లల మనస్థత్వాలు ఎప్పటికీ అర్థంకావు' అంటూ ఫన్నీ రిప్లై ఇవ్వగా నెటిజన్లు సైతం సరదా కామెంట్లతో ఎంజాయ్ చేస్తున్నారు.
Next Story