ఈ రోజుల్లో అందరికీ ఆమె ఇన్స్పిరేషన్ అంటూ సమంత పోస్ట్.. ఎవరి గురించంటే?

by Disha Web Desk 6 |
ఈ రోజుల్లో అందరికీ ఆమె ఇన్స్పిరేషన్ అంటూ సమంత పోస్ట్.. ఎవరి గురించంటే?
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గత కొద్ది కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. మయోసైటీస్ వ్యాధి బారిన పడటంతో.. అన్నింటికీ దూరమై చికిత్స తీసుకుంది. ఇక ఇప్పుడిప్పుడే వ్యాధి నుంచి కోలుకోవడంతో మళ్లీ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి కనబరుస్తోంది. కానీ ఆఫర్ల్ రావపోవడంతో.. యాడ్స్ చేస్తూ డబ్బులు సంపాదిస్తోంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ ఫొటోలు షేర్ చేసి అందరికీ షాకిస్తుంది. ఇంతకుముందు కంటే మరింత గ్లామర్ డోస్ పెంచి తన అందాలను ఆరబోస్తోంది.

తాజాగా, సమంత ఓ ఇంటర్ విద్యార్థిని పై ప్రశంసలు కురిపించింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో కర్నూల్ జిల్లాకు చెందిన నిర్మల మంచి మార్కులు సాధించి టాపర్‌గా నిలిచింది. ఆమె పదో తరగతిలో కూడా ఎక్కువ మార్కులు సాధించడం విశేషం. అయితే నిర్మల తల్లిదండ్రులు తనకు పెళ్లి చేయాలని చూసినా సరే తనకు చదువుపై ఉన్న ఇష్టంతో ఇంటర్‌లో ఏకంగా 440కి 421 మార్కులు సాధించి శభాస్ అనిపించుకుంది.

ఇదే విషయంపై సామ్ సోషల్ మీడియా వేదికగా స్పందించి ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ఈ రోజుల్లో నిర్మల చాలా మందికి ఇన్స్పిరేషన్ అంటూ రాసుకొచ్చింది. అంతేకాకుండా ఓ ఓ పత్రిక క్లిప్‌ను షేర్ చేసింది. ప్రస్తుతం సామ్ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో ఈ విషయం తెలిసిన నెటిజన్లు సమంత చాలా గ్రేట్ అని అంటున్నారు. ఎంత బీజిగా ఉన్నప్పటికీ టాలెంట్‌ ఉన్నవారిని మరెన్నో సాధించేలా ప్రోత్సహిస్తుందని అంటున్నారు.

Next Story

Most Viewed