ఇంట్రెస్టింగ్ స్టోరీతో చెర్రీకి విష్ చేసిన సమంత.. కన్ఫూజన్‌లో తలలు బద్దలు కొట్టుకుంటోన్న ఫ్యాన్స్.

by Disha Web Desk 9 |
ఇంట్రెస్టింగ్ స్టోరీతో చెర్రీకి విష్ చేసిన సమంత.. కన్ఫూజన్‌లో తలలు బద్దలు కొట్టుకుంటోన్న ఫ్యాన్స్.
X

దిశ, సినిమా: నిన్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్‌ గా జరిగాయి. ప్రముఖ సినీ సెలబ్రిటీలు, పలువురు రాజకీయ నాయకులు, ఫ్యాన్స్ చరణ్ కు పెద్ద ఎత్తున పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాకుండా చెర్రీ కో స్టార్ట్స్ కూడా విష్ చేశారు. కొందరు సెలబ్రిటీలు చేసే విష్ చాలా ప్రత్యేకంగా మిగిలిపోతుంటాయి. అయితే టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత.. రామ్ చరణ్ కు వెరీ క్రేజీగా విషెష్ తెలిపింది.

‘‘హ్యాపీ బర్త్ డే ఓజి (0riginal gangster) రామ్ చరణ్. మీలా ఉండటం అసలు ఎవరికీ సాధ్యం కాదు’’ అంటూ సామ్ ఇన్‌స్టా స్టోరీ రాసుకొచ్చింది. అంతేకాకుండా చరణ్ యమా స్టైలిష్ గా ఉన్న ఫొటో కు ఈ క్యాప్షన్ రాయడం సోషల్ మీడియాలోని జనాల్లో ఆసక్తి నెలకొంది. పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడం వరకు బాగుంది. కానీ ఓజి అని వర్ణించడమే కొత్తగా ఉందంటూ నెట్టింట చర్చ మొదలైంది.

ఓజి అని ఎవరినైనా పిలవొచ్చు. కానీ ప్రస్తుతం ఓజి సినిమాలో చరణ్ బాబాయ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్నాడు. ఈ పోస్ట్ వీక్షించిన మెగా ఫ్యాన్స్ ‘ఏంటి సమంత ఇలా తిరకాసు పెట్టేశావు’. అంటూ కన్ఫూజన్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సమంత-రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. చిట్టిబాబు-రామలక్ష్మి గా నటించిన వీరి కెమిస్ట్రీ అద్భుతంగా పండింది.


Next Story

Most Viewed