Allu Arjun : అల్లు అర్జున్‌పై మనసు పారేసుకున్న సమంత.. ఆ విషయంలో తనే రోల్ మోడల్ అంటూ..

by Dishafeatures2 |
Allu Arjun : అల్లు అర్జున్‌పై మనసు పారేసుకున్న సమంత.. ఆ విషయంలో తనే రోల్ మోడల్ అంటూ..
X

దిశ, సినిమా : టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతనికున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా మామూలుగా ఉండదు. తన నటన, డ్యాన్స్, స్టైల్‌తో ఆకట్టుకోవడంలో బన్నీ స్పెషాలిటే వేరు. అయితే అదే రేంజ్‌లో నటిగా మంచి పాపులారిటీ సంపాదించుకుని, ప్రస్తుతం మూవీస్‌కు దూరంగా ఉంటున్న క్యూట్ హీరోయిన్ సమంత బన్నీపై మనసు పారేసుకుందట!. ‘ఆ విషయంలో అతనిని చూసి ఎంతో నేర్చుకున్నా’నంటూ ఈ అమ్మడు చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా.. అటు బన్నీ ఫ్యాన్స్, ఇటు సామ్ ఫ్యాన్స్ రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. కొందరైతే అందుకే నాగచైతన్య నిన్ను వదిలేశాడేమోనని కూడా కామెంట్ చేస్తున్నారు.

సినిమాలకు ఇంతకాలం బ్రేక్ ఇచ్చిన సామ్ మళ్లీ ఇండస్ట్రీలోకి వచ్చే ప్రయత్నం చేస్తోంది. అయితే ఇటీవల తమిళ నాడులోని వెల్లూర్‌లో ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆమె అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘అల్లు అర్జున్ నా యాక్టింగ్ రోల్ మోడల్. అతడు ఓ పవర్ హౌజ్ పర్ఫార్మర్‌గా మారాడు. అతని నుంచి నేర్చుకోవడానికి నేను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తాను’’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలతో అక్కడున్న స్టూడెంట్స్, బన్నీ ఫ్యాన్స్ సంతోషంగా కేరింతలు కొట్టారు. ప్రజెంట్ ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. సామ్ బన్నీపై మనసు పారేసుకుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Next Story

Most Viewed