డీప్ ఫేక్ వీడియోపై మరోసారి స్పందించిన రష్మిక.. ప్రశ్నిస్తే దారుణంగా మాట్లాడుతున్నారు!

by Anjali |
డీప్ ఫేక్ వీడియోపై మరోసారి స్పందించిన రష్మిక.. ప్రశ్నిస్తే దారుణంగా మాట్లాడుతున్నారు!
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న యానిమల్ చిత్రంలో నటించి బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా ఏకంగా రూ. 900 కోట్ల వసూళ్లను రాబట్టి బాక్సాఫీసును కొల్లగొట్టింది. రన్‌బీర్ కపూర్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ అమ్మడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 చిత్ర షూటింగ్‌లో ఫుల్ బిజీగా గుడుపుతోంది. అలాగే రష్మిక చేతితో మరికొన్ని సినిమాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇటీవల రష్మిక డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో ఎంతటి దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ హీరోయిన్‌తో పాటు కాజోల్, నోరా ఫతేహి, ప్రియాంక చోప్రా, అలియా భట్ ఇలా పలువురు హీరోయిన్స్ డీప్ ఫేక్ వీడియోలు నెట్టింట ఫుల్ వైరలయ్యాయి. ఈ వీడియోపై పలు సినీ సెలబ్రిటీలతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా స్పందించి.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మండిపడ్డారు. ఈ ఇష్యూపై పోలీసులు నెలల తరబడి విచారణ జరిపి.. రీసెంట్‌గా గుంటూరుకు చెందిన ఒక యువకుడిని ఈ కేసులో అరెస్ట్ చేశారు.

డీప్ ఫేక్ ఘటనపై రష్మిక తాజాగా మరోసారి స్పందించి..‘‘ఈ విషయంపై ఎవరినైన క్వశ్చన్ చేస్తే.. ఇలాంటివి కోరుకునే కదా ఇండస్ట్రీకి వచ్చారని పెద్ద ఎత్తున కామెంట్స్ వినిపిస్తున్నాయి. నా లాంటి పరిస్థితి మరో అమ్మాయికి వస్తే ఏంటి? ప్రస్తుత సమాజంలో అమ్మాయిల సిచ్యూవేషన్ చూస్తుంటే చాలా భయంగా ఉంది. నా లాంటి వారు కొంతమందైనా డీప్ ఫేక్ వీడియో గురించి చర్చించితేనే.. మిగతా వారికి దీనిపై అవైర్‌నెస్ వస్తుంది. అమ్మాయిలకు తప్పకుండా ఈ ఇష్యూ గురించి తెలియజేయాలి అంటూ నేషనల్ క్రస్ రష్మిక మందన్న చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ బ్యూటీ కామెంట్స్ విన్న అమ్మాయిలు రష్మికపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.



Next Story