ఒకేసారి భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన రామ్ చరణ్.. ఎన్ని కోట్లంటే..?

by Disha Web Desk 7 |
ఒకేసారి భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన రామ్ చరణ్.. ఎన్ని కోట్లంటే..?
X

దిశ, సినిమా: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’, ‘RC 16’ సినిమాలతో బిజీగా ఉన్నాడు. RRR సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న చరణ్.. ప్రజెంట్ గ్లోబల్ స్టార్ బిరుదుతో దూసుకుపోతున్నాడు. అంతే కాకుండా అనేక ప్రతిష్టాత్మక అవార్డు కార్యక్రమాలకు చీఫ్ గెస్ట్‌గా హాజరై అవుతూ.. అంతర్జాతీయ వేదికలపై అవార్డులు ప్రదానం చేస్తున్నాడు. దీంతో పాటు రీసెంట్‌గా యూనివర్సటీ నుంచి గౌవర డాక్టరేట్‌ను సొంతం చేసుకుని అరుదైన గౌరవం అందుకున్నాడు.

ఇలా బ్రాండ్ వాల్యూ పెంచుకుంటూ పోతున్న మన గ్లోబల్ స్టార్.. తాజాగా రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచేసినట్లు నెట్టింట టాక్ వినిపిస్తుంది. ఆర్ఆర్ఆర్ సినిమాకు ముందు రూ. 30 నుంచి 40 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్న రామ్ చరణ్, ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’, ‘RC16’కు భారీగా పెంచేశాడట. ఈ మేరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం మేరకు..

ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, ‘RC16’ చేస్తున్నాడు. ఇందులో ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు రూ. 95 కోట్ల నుంచి రూ. 100 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. దీని తర్వాత చేస్తున్న ‘RC16’ మరో 30% పెంచేశాడట. అంటే ఇప్పుడు లెక్క ప్రకారం బుచ్చిబాబుతో చేస్తున్న ఈ సినిమాకు రూ. 125 కోట్ల నుంచి రూ. 130 కోట్ల వరకు తీసుకుంటున్నట్టు సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ‘RC16’ మూవీకి ‘పెద్ది’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.



Next Story

Most Viewed