Rajinikanth: NTR ఒక యుగ పురుషుడు: రజనీకాంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Disha Web Desk 19 |
Rajinikanth: NTR ఒక యుగ పురుషుడు: రజనీకాంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా స్టార్ హీరో రజినీ కాంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన రజినీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘‘ఎన్టీఆర్‌ నన్నెంతో ప్రభావితం చేశారు.. నేను చూసిన మొదటి సినిమా పాతాళభైరవి.. అప్పుడు నాకు ఆరేళ్లు ఉంటాయి.. నేను హీరోగా చేసిన తొలి సినిమా పేరు భైరవి’’ అని ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.

13 ఏళ్లప్పుడు లవకుశ సినిమా సమయంలో ఎన్టీఆర్‌ను చూశానని.. ఓ సారి ఎన్టీఆర్‌ వచ్చినప్పుడు చూడడానికి వెళ్తే ఎవరో నన్ను ఎత్తుకుని ఆయన్ని చూపించారని రజినీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. 18 ఏళ్లప్పుడు స్టేజ్‌పై ఎన్టీఆర్‌ను ఇమిటేట్‌ చేశానని.. ఆ తర్వాత 1977లో ఆ మహానుభావుడితోనే కలిసి టైగర్‌ సినిమా చేశానని తెలిపారు. ఎన్టీఆర్ ఒక యుగ పురుషుడు అని రజినీ ప్రశంసల వర్షం కురిపించారు. ఇక, నా అనుభవం చెబుతోంది.. ఈ వేదికపై రాజకీయం మాట్లాడొద్దని.. నేను రాజకీయం గురించి మాట్లాడితే ఏమేమో రాసేస్తారు అని రజనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Also Read..

Chandrababu: ఆయనే తొలిసారి..ఆయనే ఆఖరిసారి

రాత్రి సమయంలో పెరుగు తింటే ప్రమాదమా..? అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు.



Next Story

Most Viewed