అల్లుఅర్జున్‌కు 'పుష్ప' లారీ గిఫ్ట్!

by Disha Web |
అల్లుఅర్జున్‌కు పుష్ప లారీ గిఫ్ట్!
X

దిశ, వెబ్‌డెస్క్: పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా అల్లుఅర్జున్ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. సినిమాలోని బన్నీ స్టైల్, మ్యానరిజం అన్ని భాషల్లో ప్రేక్షకులను కట్టిపడేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా బన్నీ ఓ స్పెషల్ గిఫ్ట్ అందుకున్నారు. సినిమాలో అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ కనిపిస్తారు. అలాంటి తరహా లారీ బొమ్మను బన్నికి అయాన్ గిఫ్ట్ గా ఇచ్చారు. కుమారుడు ఇచ్చిన గిఫ్ట్ కు తెగ మురిసిపోయిన ఐకాన్ స్టార్ దాన్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. చినబాబు అయాన్ ఇచ్చిన అందమైన గిప్ట్ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సినిమాలో ఉన్నట్లు గానే లారీని కూడా రంగురంగులుగా ఉంది. టాప్ పైన పుష్ప అని రాసి ఉంది. పుష్ప బ్లాక్ బస్టర్ విజయం తర్వాత రెండో భాగం కోసం చాలా విరామమే తీసుకున్నబన్నీ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమాపై దర్శకుడు సుకుమార్ ఫోకస్ పెట్టారు. తొలి భాగంలాగానే రెండో భాగంతోను ప్రేక్షకులను మెప్పించేందుకు స్క్రిప్ట్‌కు మరింత మెరుగులు దిద్దుతున్నారు. సినిమాకు సంబంధించి నటీనటులపై కీలక సన్నివేశాలను చిత్రబృందం తెరకెక్కిస్తోంది. సినిమాలో రష్మిక, అనసూయ, సునీల్, ఫహద్ ఫాజిల్, ధనుంజయ పాత్రలతో పాటు మరిన్ని కొత్త క్యారెక్టర్స్ ను సుక్కు పరిచయం చేయబోతున్నట్లు సమాచారం.Next Story