ప్రెగ్నెన్సీ ఎమోషనల్‌ జర్నీ అంటూ Upasana కామెంట్స్.. ఒంటరి తల్లుల కోసం సంచలన నిర్ణయం!

by Disha Web Desk 6 |
ప్రెగ్నెన్సీ ఎమోషనల్‌ జర్నీ అంటూ Upasana కామెంట్స్.. ఒంటరి తల్లుల కోసం సంచలన నిర్ణయం!
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా కోడలు ఉపాసన ఇటీవల పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తల్లిగా తన కూతురిని జాగ్రత్తగా చూసుకుంటూ ఫుల్ బిజీగా ఉంది. ఇక కూతురితో టైమ్ స్పెండ్ చేస్తున్న ఉపాసన తన ప్రెగ్నెన్సీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అలాగే ఒంటరి తల్లుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ‘‘ ప్రతి తల్లికి ప్రగ్నెన్సీ అనేది ఓ ఎమోషనల్ జర్నీ. బిడ్డకు ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే ఆ తల్లిదండ్రులు ఎంతో తల్లడిల్లిపోతారు. అదే బిడ్డ తిరిగి ఆరోగ్యంగా మారితే వాళ్ల సంతోషానికి అవధులుండవు. అలాంటి మధుర క్షణాలు పిల్లల పేరెంట్స్‌కు అందిస్తున్న డాక్టర్స్‌కు నా తరపున ధన్యవాదాలు. నా ప్రెగ్నెన్సీ సమయంలో చాలా మంది నాకు సలహాలు ఇచ్చేవారు.

నా వరకు పర్వాలేదు కానీ, కొందరు మహిళలకు ఇలాంటి అండ దొరకదు. అది తెలిసి నేను చాలా బాధపడ్డాను. మరీ ముఖ్యంగా సింగిల్ మదర్స్‌కు ఇలాంటి విషయాల్లో సపోర్ట్ ఉండదు. కాబట్టి వీకెండ్స్‌లో నా ఆస్పత్రిలో ఒంటరి తల్లులకు ఉచితంగా ఓపీడీ చికిత్స అందిచబోతున్నాం. ఇలాంటి ఓ ఎమోషనల్ జర్నీలో నా వంతు సహాయం అందించడానికి రెడీగా ఉన్నాను. ఇది చాలా మందికి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను’’ అంటూ ఉపాసన చెప్పుకొచ్చింది. దీంతో ఈ విషయం తెలిసిన నెటిజన్లు మంచి ఆలోచన అంటూ ఉపాసన పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Also Read: అక్కినేని ఫ్యామిలీలోకి కొత్త మెంబర్.. కొడుకుల కోసం Nagarjuna అంత పని చేశాడా?

Next Story

Most Viewed