టాలీవుడ్ డైరెక్టర్స్ కోసం భారీ విరాళం ఇచ్చిన ప్రభాస్.. ప్రశంసలతో ముంచెత్తుతున్న నెటిజన్లు

by Disha Web Desk 6 |
టాలీవుడ్ డైరెక్టర్స్ కోసం భారీ విరాళం ఇచ్చిన ప్రభాస్.. ప్రశంసలతో ముంచెత్తుతున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీ అయిపోయాడు. అన్ని పాన్ ఇండియా సినిమాలే చేస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే డార్లింగ్ గత ఏడాది సలార్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అదే ఫామ్‌తో షూటింగ్స్ చేస్తూ బిజీ బిజీ లైఫ్ గడుపుతున్నాడు. అంతేకాకుండా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో మందిని ఆదుకుంటున్నాడు. ఆయన గొప్ప మనసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. షూటింగ్ సెట్‌లో ప్రభాస్ పెట్టే భోజనం కోసం వెయిట్ చేస్తుంటారు. వారే కాకుండా టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్స్ కూడా ఒక్కరోజైనా ప్రభాస్ ఇంటి భోజనం చేయాలని కోరుకుంటారు. అంతేకాకుండా ఇప్పటికే ఆయన చాలా సార్లు విరాళం ఇచ్చి మంచి మనసు చాటుకున్నాడు.

తాజాగా, ప్రభాస్ తెలుగు డైరెక్టర్స్‌కు భారీ విరాళం ఇచ్చి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఫిలిం డైరెక్టర్ అసోసియేషన్ దాసరి నారాయణరావు పుట్టిన రోజు మే 4 ఉండటంతో ముందుగానే ప్రభాస్ రూ.35 లక్షలు ఇచ్చాడని డైరెక్టర్ మారుతి వెల్లడించాడు. ఇక ఈ విషయం తెలిసిన నెటిజన్లు ప్రభాస్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అయితే ఈ వేడుక ఘనంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించబోతున్నట్లు సమాచారం. దీనికి సినీ ప్రముఖులంతా హాజరుకానున్నారు.



Next Story

Most Viewed