పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించిన వడ్డేపల్లి శ్రీనివాస్ పాట

by Disha Web Desk 2 |
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించిన వడ్డేపల్లి శ్రీనివాస్ పాట
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సింగర్ వడ్డేపల్లి శ్రీనివాస్ కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇటీవలే హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం సికింద్రాబాద్‌ చిలకలగూడలోని ఆయన నివాసంలోనే చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా.. గురువారం పరిస్థితి విషమించి వడ్డేపల్లి తుదిశ్వాస విడిచారు.

కాగా, వడ్డేపల్లి శ్రీనివాస్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్-హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాలో ‘పిల్లా నువ్వులేని జీవితం’ అనే పాటను పాడి తెలుగు సినీ ప్రేక్షకుల్లో మంచి జోష్ నింపారు. చిత్రం విడుదలైన కొన్నాళ్ల పాటు ఎక్కడ చూసినా ఈ పాట సందడే కనపించేది. అంతేకాదు.. అక్కినేని నాగార్జున నటించిన కింగ్ సినిమాలో, రవితేజ నటించిన బెంగాల్ టైగర్ సినిమాలో, నమస్తే అన్న అనే తదితర సినిమాల్లో పాటలు పాడి తెలుగు ప్రేక్షకుల గుండెళ్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆయన మరణవార్త తెలిసిని సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.

Next Story

Most Viewed