BRS ఇక ఉండదు అని కిషన్ రెడ్డి మాట్లాడటం కరెక్ట్ కాదు.. విజయశాంతి సీరియస్

by GSrikanth |
BRS ఇక ఉండదు అని కిషన్ రెడ్డి మాట్లాడటం కరెక్ట్ కాదు.. విజయశాంతి సీరియస్
X

దిశ, వెబ్‌‌డెస్క్: కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా ఒక పోస్టు పెట్టారు. ‘‘తెలంగాణలో బీఆర్ఎస్ అనే పార్టీ ఇక ఉండదు అని అంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి అభిప్రాయం సమంజసం కాదు. ప్రాంతీయ భావోద్వేగాలు ప్రజా మనోభావాలను వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే వస్తుండడం దక్షిణాది రాష్ట్రాల సహజ విధానం.. దశాబ్ధాలుగా కరుణానిధి, ఎంజీఆర్, ఎన్టీఆర్, రామకృష్ణ హెగ్డే, జయలలిత నుండి ఇప్పటి బీఆర్ఎస్, వైసీపీ వరకు ఇస్తున్న రాజకీయ సమాధానం విశ్లేషించుకోవాల్సిన తప్పని అవసరం.. ఎన్నడైనా.. వాస్తవం.. ఈ దక్షిణాది స్వీయ గౌరవ అస్థిత్వ సత్యం కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్లు, బీజేపీ కనీసం ఆలోచన చెయ్యని అంశం బహుశా కిషన్ రెడ్డి ప్రకటన భావం’ అని విజయశాంతి ఎక్స్(ట్విట్టర్‌)లో పేర్కొన్నారు. కాగా, పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత కిషన్ రెడ్డి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రమంగా బీఆర్ఎస్ కనుమరుగు కావడం ఖయమన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపించని బీఆర్ఎస్.. ఇక ఉండదు అని అని అన్నారు. దీంతో కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై విజయశాంతి స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు.

Next Story