సుశాంత్ జీవితంపై ఎవరు సినిమా తీయొద్దు.. హైకోర్టును ఆశ్రయించిన తండ్రి

by Disha Web Desk 9 |
సుశాంత్ జీవితంపై ఎవరు సినిమా తీయొద్దు.. హైకోర్టును ఆశ్రయించిన తండ్రి
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ రాజ్ పుత్ 2020 జూన్ 14న ముంబైలోని సబర్బన్ బాంద్రాలోని తన అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సుశాంత్ మరణించి ఏళ్లు గడుస్తోన్న ఈ హీరో సూసైడ్ ఇప్పటికీ వీడని మిస్టరీనే. సుశాంత్‌ ఆత్మహత్య చేసుకోలేదని.. హత్య చేశారని అటు కుటుంబసభ్యులు ఇటు ఫ్యాన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, సుశాంత్ బయోపిక్‌గా రూపొందిన ‘న్యాయవాది: ది జస్టిస్’ అనే చిత్రం ఓటీటీలో స్ర్టీమింగ్ అయ్యింది. దీంతో ఆయన ఫ్యామిలీ ఈ మూవీ స్ట్రీమింగ్ ఆపాలని కోర్టును ఆశ్రయించింది. కానీ కోర్టు సినిమాను నిలిపివేయడానికి అంగీకరించలేదు.

తాజాగా సుశాంత్ తండ్రి గురువారం దిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం ఈ మూవీ ప్రొడ్యూసర్లతో పాటు మరికొంతమందికి నోటీసులు జారీ చేసింది. తన కుమారుడి జీవితంపై సినిమాలు తీస్తూ.. అన్యాయంగా ఫైనాన్సియల్‌గా ప్రయోజనం పొందుతున్నారని ఆయన ఆరోపించారు. తన కుమారుడి జీవితంపై చాలా మంది అనుమతి లేకుండా సినిమాలు తీస్తున్నారని, వెబ్‌ సిరీస్‌లు, పుస్తకాలు రాస్తున్నారని ఆయన సుశాంత్ తండ్రి పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఈ విధంగా చేయడం వల్ల సుశాంత్ పరువు, తన ప్రైవసీ, హక్కులకు విరుద్ధమని ఈ హీరో తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు.



Next Story

Most Viewed