రెమ్యూనరేషన్‌ భారీగా పెంచేసిన నిఖిల్.. ఎన్నికోట్లంటే?

by Hamsa |
రెమ్యూనరేషన్‌ భారీగా పెంచేసిన నిఖిల్.. ఎన్నికోట్లంటే?
X

దిశ, వెబ్ డెస్క్: యంగ్ హీరో నిఖిల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ‘హ్యాపీ డేస్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చ తన అందం నటనతో ఫ్యాన్‌ను సంపాదించుకున్నాడు. ఇటీవల కార్తికేయ-2 చిత్రంతో భారీ హిట్ కొట్టి వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పుడు రామ్ చరణ్ ‘V’ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్‌పై ‘ద ఇండియా హౌస్’ సినిమాతో ప్రేక్షకులకు ముందుకు రాబోతున్నాడు. తాజాగా, నిఖిల్ రెమ్యూనరేషన్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం నిఖిల్ ఒక్క మూవీకి 8 కోట్ల రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఠాగూర్ మధు నిర్మాతగా వస్తున్న ‘స్వయంభూ’ చిత్రం విడుదలయ్యాక వచ్చే లాభాలను కూడా నిఖిల్ తీసుకోబోతున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా మరో పాన్ ఇండియా హిట్ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు. ప్రస్తుతం నిఖిల్ జాగ్రత్త పడుతూ సక్సెస్ కొట్టడానికి సిద్ధపడుతున్నాడు.

Read More... ‘అహింస’ ప్రేక్షకుడికి పెద్ద హింసేనా..? డైరెక్టర్ తేజపై నెటిజన్లు ఫైర్..!

ఆ విషయం నిర్మాతలకు తెలిస్తే నాకు పని ఇవ్వరు: స్టార్ హీరో

Advertisement

Next Story