ఒంటరిగా ఉండలేక ముగ్గురి పిల్లల తండ్రిని వివాహం చేసుకున్న స్టార్ హీరోయిన్!

by Disha Web Desk 9 |
ఒంటరిగా ఉండలేక ముగ్గురి పిల్లల తండ్రిని వివాహం చేసుకున్న స్టార్ హీరోయిన్!
X

దిశ, సినిమా: ఒకప్పుడు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, బెంగాళీ, మలయాళం, మరాఠీ సినిమాల్లో నటించి అగ్ర హీరోయిన్ గా పేరు దక్కించుకుంది సీనియర్ హీరోయిన్ జయప్రద. చిన్న వయస్సులోనే సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి.. తొలిసారిగా భూమి కోసం’ చిత్రంలో అవకాశం కొట్టేసింది. తర్వాత అమితాబ్ బచ్చన్, రాజేష్ ఖన్నా, కమల్ హాసన్ వంటి అగ్ర హీరోల సరసన నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది.

‘షరాబి, తొహ్ఫా, సాగర సంగమం, సంజోగ్’ వంటి సినిమాలు జయప్రదకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఈ నటి నటనతో, అందంతో ఎంతోమంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను దక్కించుకుంది. 2004 నుంచి 2014 వరకు రాంపూర్ నుంచి పార్లమెంటు సభ్యురాలి(ఎంపీ)గా కూడా బాధ్యతలు నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో జన్మించిన ఈ నటి.. నిర్మాత శ్రీకాంత్ నహతాను వివాహం చేసుకుంది. అయితే శ్రీకాంత్ ఈ నటిని పెళ్లి చేసుకోకముందే ఆల్రెడీ ఓ మహిళతో వివాహమైంది. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారట. కానీ జయప్రద అప్పటికే నిర్మాతతో పీకల్లోతు ప్రేమలో ఉందట.

శ్రీకాంత్ కు పెళ్లైందని తెలిసినా ఏం సందేహించకుండా అతడ్ని పెళ్లి చేసుకుందట. కానీ నిర్మాత శ్రీకాంత్ మొదటి భార్యకు ఇప్పటికి డివోర్స్ ఇవ్వలేదని జయప్రద ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చినట్లు సోషల్ మీడియాలోని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ వార్త విన్న పలువురు జనాలు.. ఓ స్టార్ హీరోయిన్ ముగ్గురు పిల్లలున్న తండ్రిని వివాహం చేసుకుందంటే అర్థం చేసుకోవచ్చు. ప్రేమ ఎంత గుడ్డిదో అని కొంతమంది కామెంట్లు చేయగా.. మరికొంతమంది ఒంటరిగా ఉండలేక ఆయన్ను పెళ్లి చేసుకున్నావా? అంటూ నటి పై నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.

Read More : ఒర చూపులతో టెంప్ట్ చేస్తున్న డీజే టిల్లు పోరి


Next Story