Nagarjunaకు జోడిగా Mrunal Thakur? షాక్‌లో ఫ్యాన్స్!

by Dishanational2 |
Nagarjunaకు జోడిగా Mrunal Thakur? షాక్‌లో ఫ్యాన్స్!
X

దిశ, సినిమా: ఈ మధ్యకాలంలో సీనియర్ హీరోలంతా వరుస విజయాలతో దూసుకుపోతున్నప్పటికీ కింగ్ నాగార్జున మాత్రం వెకనపడిపోయాడు. లాస్ట్ టైమ్ భారీ హోప్స్‌తో రిలీజ్ అయిన 'ఘోస్ట్' బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో నాగార్జున ఇకపై ఇలాంటి ప్రయోగాలకు గుడ్ బై చెప్పి మాస్ మసాలా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీస్ చేసేందుకు ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలోనే రీసెంట్‌గా విడుదలైన 'ధమాకా'కు కథ, స్ర్కీన్ ప్లే, డైలాగ్స్ అందించిన రచయిత ప్రసన్న కుమార్‌ను పిలిచి తన నెక్ట్స్ సినిమా డైరెక్ట్ చేసే అవకాశం కల్పించాడట నాగ్. కాగా ఈ మూవీలో నాగ్‌కి జోడిగా మృణాల్ ఠాకూర్‌ని ఓకే చేసినట్లు తెలుస్తుంది. కానీ, ఈ విషయంలో నాగార్జున అండ్ మృణాల్ ఫ్యాన్స్ కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. 'యంగ్ హీరోయిన్ ఎందుకు. వయస్సుకు తగ్గ వాళ్లతో చేస్తే బాగుంటుంది' అంటూ నాగార్జునకు సూచిస్తున్నారు.

Read more:

సీక్రెట్ ఎఫైర్ గురించి ఓపెన్ అయిన స్టార్ నటి.. మిస్టరీ మ్యాన్ అతడేనట?


Next Story

Most Viewed