మిస్సయిన క్రేజీ కాంబినేషన్.. పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ మల్టీస్టారర్?

by Anjali |
మిస్సయిన క్రేజీ కాంబినేషన్.. పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ మల్టీస్టారర్?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌- అల్లు అర్జున్‌కు ఎంతగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ముఖ్యంగా పవన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం ఒక సునామి అనే చెప్పాలి. ప్రస్తుతం ఆయనకు ఉన్నంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ టాలీవుడ్‌లో ఏ స్టార్ హీరోకు లేదు. ఆ తర్వాత రామ్ చరణ్, బన్నీలు సైతం మాంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అయితే గతంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. పవన్ కళ్యాణ్ అండ్ అల్లు అర్జున్ కలయికలో ఒక మల్టీస్టారర్ ప్లాన్ చేసారట. ఎఫ్2, ఎఫ్3 తరహాలో పూర్తి స్థాయి వినోదాత్మక సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నాడట.

దీనికి డైరెక్టర్‌గా అనిల్ రావిపూడిని ఎంపిక చేశారు. ఎప్పుడో ప్రారంభం అవ్వాల్సిన ఈ చిత్రం పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ వల్ల వాయిదా పడుతూ వెళ్లింది. ఇక ఆయన సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చినాక ఈ ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేద్దాం అనుకునేలోపే బన్నీకి డేట్స్ ఖాళీ లేకపోవడంతో ‘వకీల్ సాబ్’ మూవీ చేసాడట. ముందు ముందు అయినా ఈ క్రేజీ కాంబినేషన్ సెట్స్ మీదకి వెళ్తుందో లేదో అని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చేస్తున్నారు. ఒకవేళ వెళ్తే మాత్రం ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేస్తుందని నెటిజన్లు భావిస్తున్నారు.

Also Read: నెల రోజుల పాటు మెగా అభిమానులకు పండగే!

Next Story

Most Viewed