5 వ తరగతిలోనే నన్ను రేప్ చేశారు.. కోలుకోవడానికి 10 ఏళ్లు పట్టింది: స్టార్ లేడీ కమెడియన్

by Disha Web Desk 9 |
5 వ తరగతిలోనే నన్ను రేప్ చేశారు.. కోలుకోవడానికి 10 ఏళ్లు పట్టింది:  స్టార్ లేడీ కమెడియన్
X

దిశ, సినిమా: 2011 లో నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది నటి స్నిగ్ధ. ఇందులో పింకీ పాత్రలో.. నాని, నిత్యా మీనన్లకు ఫ్రెండ్ గా నటించి ప్రేక్షకులను మెప్పించింది. అబ్బాయిలా పాయింట్, షర్ట్ ధరించి.. ‘మేం వయసుకు వచ్చాం, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, రొటీన్ లవ్ స్టోరీ, దమ్ము’ వంటి చిత్రాల్లో ఎంతో చలాకీగా నటించి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసింది.

తాజాగా ఈ నటి ఓ ఇంటర్వ్యూకు హాజరై తన జీవితంలో ఎదుర్కొన్న చెదు అనుభవాలను పంచుకుంది. తాజాగా దావత్ అనే షోకు స్నిగ్ద గెస్ట్ గా వెళ్లింది. ఈ షోలో స్నిగ్ధ మాట్లాడుతూ.. ‘‘మా అమ్మ చనిపోయినప్పుడు నేను ఆమెను చూడలేకపోయాను. ఆ సిచ్యువేషన్ నన్ను ఎన్నో సంవత్సరాలు వేధించింది. నేను 5 వ తరగతిలో ఉన్నప్పుడు ఇందిరా పార్క్ కు వెళ్లాం.

అక్కడ ఆడుకుంటున్న క్రమంలో ఎవడో వచ్చి నన్ను పొదల చాటుకు తీసుకెళ్లి, నన్ను లైంగికంగా వేధించాడు. అది రేప్ అటెంప్ట్ అనే చెప్పాలి. ఈ సంఘటన నుంచి కోలుకోవడానికి నాకు దాదాపు 10 సంవత్సరాలు పట్టింది కావచ్చు. నైట్ బెడ్ పై మా నాన్న, మామ పడుకున్నా చాలా భయమేస్తుంది’’. అంటూ స్నిగ్ధ వెల్లడించింది. ప్రస్తుతం ఈ నటి కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.


Next Story

Most Viewed