Hyper Adi : ఒకప్పుడు టైమ్ బాగోలేక లేడీస్ హాస్టల్‌లో ఉన్నా.. అమ్మాయిలు రాగానే గదిలోకి వెళ్లి తలుపులు వేసుకునేవాన్ని.. హైపర్ ఆది కామెంట్స్ వైరల్

by Dishafeatures2 |
Hyper Adi : ఒకప్పుడు టైమ్ బాగోలేక లేడీస్ హాస్టల్‌లో ఉన్నా.. అమ్మాయిలు రాగానే గదిలోకి వెళ్లి తలుపులు వేసుకునేవాన్ని.. హైపర్ ఆది కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా : హైపర్ ఆది.. ప్రస్తుతం ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు లేరనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. టెలివిజన్ షో కమెడియన్‌గా మంచి సక్సెస్ అందుకున్నవారిలో ఇతనొకడు. ఫేమస్ కామెడీ షో అయిన జబర్దస్త్‌తో కెరియర్ ఎంట్రీ ఇచ్చిన ఆది ప్రారంభంలో స్ర్కిప్ట్ రైటర్‌గా పనిచేశాడు. క్రమంగా అదిరే అభి టీమ్‌లో కమెడియన్‌గా చేస్తూ, తన పంచ్ లాగులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఆకట్టుకున్నాడు. అలా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ఏకంగా టీమ్ లీడర్ స్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నప్పటికీ మల్లెమాల ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వచ్చే ఇతర టెలివిజన్ కార్యక్రమాల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నాడు.

వరుస కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్న హైపర్ ఆదిని ఇటీవల సినిమా అవకాశాలను కూడా వరిస్తు్న్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆది తన కెరియర్ ప్రారంభంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, అనుభవాలను పంచుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్ వచ్చిన కొత్తలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశా. ఆర్థికంగా ఇబ్బందులు పడ్డా. కనీసం రూమ్ రెంటు కూడా కట్టలేని పరిస్థితి నాది. మా బంధువుల్లో ఒకరు లేడీస్ హాస్టల్ రన్ చేస్తున్నారు. నా పరిస్థితి చూసి హాస్టల్‌ బిల్డింగ్‌లోని ఒక గదిలో నాకు ఉండటానికి అవకాశం ఇచ్చారు. హాస్టల్‌ పైపోర్షన్‌లో ఉండేది. నేను కింద ఉండేవాడిని. అమ్మాయిలందరూ తినడానికి కిందికి వచ్చినప్పుడు మస్తు ఇబ్బంది పడేవాన్ని. వారు కిందికి దిగుతున్నారంటేనే గది లోపలికి పోయి, తలుపులు వేసుకునే వాడిని, అస్సలు బయటకు వచ్చే వాడిని కాదు. లేదంటే తినడానికి వారు కిందికి రాకముందే నేను ఎక్కడికైనా బయటకు వెళ్లే వాడిని. వారు తినేసి పైకి వెళ్లిపోయాక తర్వాత వచ్చే వాడిని’’ అంటూ చెప్పుకొచ్చాడు ఆది.

ఇకపోతే జబర్దస్త్‌లో సెకండ్ లీడ్ కమెడియన్‌గా చేసినప్పటి నుంచి తాను ఆర్థికంగా నిలదొక్కుకున్నానని, ప్రస్తుతం అయితే ఎటువంటి ఇబ్బందులు లేవని తెలిపాడు ఆది. జీవితంలో ఎవరికైనా కష్టాలు సహజమేనని, ఎదగడానికి మనకంటూ అవకాశాలు వస్తుంటాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పుకొచ్చాడు. ప్రజెంట్ ఈ కామెంట్స్ వైరల్ అవుతుండగా ‘కష్టపడి పైకొచ్చావు ఆది. ఆల్ ది బెస్ట్’ అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


Next Story