అది వెబ్ సిరీస్ కాదు బ్లూ ఫిల్మ్‌.. టాలీవుడ్ నటుడు షాకింగ్ కామెంట్స్

by Disha Web Desk 6 |
అది వెబ్ సిరీస్ కాదు బ్లూ ఫిల్మ్‌.. టాలీవుడ్ నటుడు షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోలు వెంకటేష్, రానా కలిసి నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. ఇది ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్‌లో మార్చి 10న విడుదలై పలు విమర్శలను ఎదుర్కొంటుంది. తాజాగా, దీనిపై సీనియర్ నటుడు శివకృష్ణ ‘రానానాయుడు’ వెబ్ సిరీస్‌ను ఉద్దేశిస్తూ మొత్తం ఓటీటీ కంటెంట్, వెబ్ సిరీస్‌‌లపై పలు షాకింగ్ కామెంట్స్ చేశాడు.

ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ నేను ఓటీటీలో రీసెంట్‌గా ఓ సినిమా చూశాను. నా పిల్లలు వ‌స్తుంటే దాన్ని ఆఫ్ చేస్తున్నాను. ఎందుకు చూశాన్రా దేవుడా అనిపించింది. ఆల్ మోస్ట్ అది బ్లూ ఫిల్మే. ఓటీటీలో అలాంటివి అవ‌స‌ర‌మా?.. ఓటీటీ కాదు.. వాడు బాబు ఎవ‌డైనా స‌రే! సెన్సార్ చేయాలి. అడ‌ల్ట్ కంటెంట్‌ను థియేట‌ర్స్ చూడాల‌నుకుంటే జ‌నాలు డ‌బ్బులు పెట్టి వ‌స్తారు. కానీ ఓటీటీల్లో అలా కాదు క‌దా.. ఇంట్లోనే అమ్మా నాన్న ఉంటే ఒక‌డు రూమ్‌లో టిఫిన్ తింటూ ఇవే చూస్తుంటాడు. ఇవాళ భార‌త‌దేశంలో చాలా మంది డ్రగ్స్‌కి బానిస‌లు అయిపోయినా.. చిన్నవాళ్లు సెక్స్‌లో పాల్గొంటున్నా.. పాడ‌య్యారంటే ఈ ఓటీటీ సినిమాల వ‌ల్లనే. అలాంటి కంటెంట్ ఉన్నప్పుడు ఫ్యామిలీతో ఎలా చూడగలుగుతారు. మన సాంప్రదాయాలను, హైందవ దర్మాలను, సంస్కృతిని ఖూనీ చేస్తున్నారు. అలా చేయడం వల్ల త్వరలోనే దేశం నాశనం అవుతుంది’’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ ‘రానా నాయుడు పై అని స్పష్టంగా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి :

Rajamouli: ఆస్కార్ ఈవెంట్‌కు రాజ‌మౌళి ఎంత ఖర్చు పెట్టాడో తెలుసా?

ఆ సీన్స్ తొలగించాలి.. రానా నాయుడు వెబ్ సిరీస్‌పై విజయశాంతి ఫైర్


Next Story

Most Viewed