ఆ సీన్స్ తొలగించాలి.. రానా నాయుడు వెబ్ సిరీస్‌పై విజయశాంతి ఫైర్

by Disha Web Desk 19 |
ఆ సీన్స్ తొలగించాలి.. రానా నాయుడు వెబ్ సిరీస్‌పై విజయశాంతి ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరో రానా, వెంకటేష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘‘రానానాయుడు’’. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్‌లో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. సినిమా నిండ అశ్లీల కంటెంట్ ఉండటంతో ఫ్యామిలీ ఆడియెన్స్ రానా, వెంకటేష్‌పై ఫైర్ అయ్యారు. ఇదిలా ఉండగానే.. తాజాగా రానా నాయుడు వెబ్ సిరీస్‌పై యాక్టర్, బీజేపీ నేత విజయశాంతి రియాక్ట్ అయ్యారు. ఈ వెబ్ సిరీస్‌పై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రానానాయుడు వెబ్ సిరీస్‌లోని అభ్యంతరకర దృశ్యాలను తొలగించాలని విజయశాంతి డిమాండ్ చేశారు. మహిళలు ఈ సిరీస్‌పై ఉద్యమాలు చేసేదాకా తెచ్చుకోవద్దని వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా ఓటీటీల్లో అశ్లీలతపై సెన్సార్ కచ్చితంగా ఉండాలని ఆమె డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి :

దగ్గుబాటి హీరోలపై .. విజయశాంతి ఫైర్

అది వెబ్ సిరీస్ కాదు బ్లూ ఫిల్మ్‌.. టాలీవుడ్ నటుడు షాకింగ్ కామెంట్స్

Next Story