Raviteja: రవితేజ లేకపోతే 'ధమాకా' డిజాస్టర్.. Bandla Ganesh షాకింగ్ కామెంట్స్

by Disha Web Desk 13 |
Raviteja: రవితేజ లేకపోతే ధమాకా డిజాస్టర్.. Bandla Ganesh షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ 'ధమాకా' సినిమా పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. చాలా రోజుల తర్వాత సాలిడ్ హిట్ అందుకున్న రవితేజ.. ప్రస్తుతం మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ సినిమా గురించి మాట్లాడిన బండ్ల.. 'రవితేజ ఎప్పటికీ వెలుగునిచ్చే సూర్యుడు. ఎన్నో కష్టాలని ఎదుర్కొని, ఎవరి సపోర్ట్ లేకుండా, అనుకున్నది సాధించాడు. కొన్ని వందల మందికి అవకాశాలు ఇస్తున్నాడు. రవితేజ ఒక ఇన్‌స్పిరేషన్ .. రవితేజ ఇంటిగ్రిటీ. రవితేజ రియాల్టీ.. రవితేజ రాజసం.. రవితేజ అరాచకం. రవితేజ ఎవర్ గ్రీన్. 'ధమాకా' చూసినప్పుడు చాలా గర్వంగా అనిపించింది. డైరెక్టర్ ఇరగదీశాడు. ఈ సినిమా రవితేజ తో కాకుండా వేరే హీరోతో చేస్తే ఒక్కరోజు మాత్రమే ఆడేది. కచ్చితంగా ఈ మూవీ వందకోట్లు క్రాస్ చేస్తుంది' అని చెప్పుకొచ్చాడు.

Next Story