ఆ హీరోయిన్ అంటే నాకు చాలా ఇష్టం.. కానీ ఒక్కటే ప్రాబ్లమ్ : ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Dishafeatures1 |
ఆ హీరోయిన్ అంటే నాకు చాలా ఇష్టం.. కానీ ఒక్కటే ప్రాబ్లమ్ : ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: ఇటీవల ‘సలార్’ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు ప్రభాస్. పాన్ ఇండియా స్టార్ అయినప్పటికి ఇలాంటి హిట్ కొట్టడానికి మన డార్లింగ్ కి దాదాపు ఆరేళ్ల పట్టింది. కాగా ఈ మూవీ ఏకంగా రూ. 700 కోట్ల వరకు వసూలు చేసింది. ఇప్పుడు ప్రస్తుతం ‘సలార్ పార్ట్ 2’ తో పాటు ‘కల్కి’, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే సినిమా చేస్తున్న ప్రభాస్ వరుస సినిమాలతో గ్యాప్ లేకుండా గడుపుతున్నాడు. ఇకపోతే తాజాగా ప్రభాస్ ఓ హీరోయిన్ యాక్టింగ్ అంటే ఇష్టం అని తెలిపారు.

ఈ ఇంటర్వ్యూలో యాంకర్ మీకు ఏ హీరోయిన్ నటన అంటే ఇష్టం అని అడగ్గా.. ‘నాకు ‘ప్రేమమ్’ ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి నటన అంటే ఇష్టం. కానీ కలిసి నటిద్దాం అంటే మా ఇద్దరికీ హైట్ లో డిఫరెన్స్ ఉంది’ అని నవ్వుతూ అన్నారు ప్రభాస్. ఇక ఈ ఇంటర్వ్యూ ఇచ్చి చాలా రోజులు అవుతున్నప్పటికీ. ప్రజంట్ మల్లోసారి సోషల్ మీడియాలో ఈ వీడియో చక్కర్లు కొడుతోంది.



Next Story

Most Viewed