సీక్రేట్‌గా పెళ్లి చేసుకున్న హైపర్ ఆది.. ఆ పాపులర్ షో లో భార్యతో ఎంట్రీ

by Dishafeatures1 |
సీక్రేట్‌గా పెళ్లి చేసుకున్న హైపర్ ఆది.. ఆ పాపులర్ షో లో భార్యతో ఎంట్రీ
X

దిశ,సినిమా: స్మాల్ స్క్రీన్ కమెడియన్ హైపర్ ఆది గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ అనే కామెడీ ప్రోగ్రామ్‌లో ఎంట్రీ తర్వాతనే ఇతను మస్తు ఫేమస్ అయిండు. తన పంచ్ డైలాగులతో టెలివిజన్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఆది అదే లెవల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నాడు. కొంతకాలం క్రితమే తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్‌కు దూరమైన ఆది ప్రజెంట్ టెలివిజన్ షోలలో హయ్యెస్ట్ పెయిడ్ కమెడియన్‌గా ఉన్నాడు. ఓ వైపు శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ లాంటి షోలు చేస్తూనే మరోవైపు మూవీ ఆఫర్స్ కూడా అందుకుంటున్నాడు.

అయితే తాజాగా ఆయన శ్రీదేవి డ్రామా కంపెనీలో తనకు పెళ్లి అయింది చెప్పుకొచ్చి, తన భార్యను తీసుకు వచ్చాడు. ఆమె ఎంట్రీ చూసిన ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. అయితే ఎప్పటిలాగా కాకుండా ఈసారి నిజమైన భార్య అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నానని తెలిపాడు. అప్పుడే యాంకర్ రష్మి హైపర్ ఆది భార్యను స్టేజ్ మీదకు పిలిచింది. అయితే వెంటనే వచ్చిన ఆమె.. మాస్క్ పెట్టుకుని, సన్ గ్లాసెస్ పెట్టుకుని మరీ స్టైల్ గా నడిచి వచ్చింది. గ్రీన్ కలర్ చీరలో ముద్దుగుమ్మలా ఉన్న ఆమె తెలుగు అమ్మాయి కాదని తెలుస్తోంది. వేరే దేశపు అమ్మాయిని తీసుకు వచ్చి స్కిట్ లో భాగంగా ఇలా చేయించినట్లు చూస్తుంటే అర్ధం అవుతుంది.

ముఖ్యంగా ఈ అందమైన నా భార్య మొహాన్ని ఇప్పటి వరకు నేనే చూడలే అని.. ఆమె భర్త మాట కంటే కూడా మేనేజర్ మాటనే ఎక్కువగా వింటుందని.. అలాగే తాను పిలిచినా రాదని.. మేనేజర్ వెళ్లమంటే మాత్రం కచ్చితంగా వెళ్తుందంటూ కామెడీ చేశాడు. ఇలా పదే పదే తన భార్య ఆమెనే, ఈమెనే అంటూ అనేక మంది అమ్మాయిలను స్టేజి మీదకు తీసుకు వస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ అంతా ఫైర్ అవుతున్నారు. ఇదంతా టి ఆర్ పి కోసమే అని ఏకి పారేస్తున్నారు.



Next Story

Most Viewed