- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు భారీ గుడ్ న్యూస్.. ‘కూలీ’ ట్రైలర్ అప్డేట్ ఇచ్చిన మూవీ మేకర్స్
సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth), లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కూలీ’(coolie).

దిశ, సినిమా: సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth), లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కూలీ’(coolie). ఈ సినిమాలో స్టార్స్ ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, నాగార్జున, సాబిన్ షాహిర్, సత్యరాజ్, శృతిహాసన్(Shruti Haasan), పూజా హెగ్డే కీలక పాత్రలో కనిపించబోతున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని కళానిది మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్రబృందం.. ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. అలాగే వరుస అప్డేట్స్ విడుదల చేస్తున్నారు. తాజాగా, మూవీ మేకర్స్ ‘కూలీ’ నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చిన సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఎండ్‌కార్డ్ వేశారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఆగస్టు-2న రాబోతున్నట్లు వెల్లడించి అభిమానుల ఆనందానికి కారణమయ్యారు.






