కపుల్స్ మధ్య గొడవలు అందుకే వస్తాయ్ హీరోయిన్ స్నేహ.. నా భర్త కూడా మరో అమ్మాయితో లవ్‌లో ఉండటంతో

by Disha Web Desk 6 |
కపుల్స్ మధ్య గొడవలు అందుకే వస్తాయ్ హీరోయిన్ స్నేహ.. నా భర్త కూడా మరో అమ్మాయితో లవ్‌లో ఉండటంతో
X

దిశ, సినిమా: ఒకప్పటి హీరోయిన్ స్నేహ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ‘ప్రియమైన నీకు’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఫ్యామిలీ సినిమాల్లో నటించి అందం, అభినయంతో ఆడియన్స్‌ను మెప్పించింది. 2009లో నటుడు ప్రసన్న కుమార్‌తో కలిసి ఓ సినిమా చేసింది. ఈ క్రమంలోనే అతడిని లవ్ చేసి పెద్దలను ఒప్పించి మరి పెళ్లి చేసుకుంది. వీరికి ఓ కూతురు, కొడుకు ఉన్నారు. ఇక అప్పటినుంచి స్నేహ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటిస్తుంది. అలాగే పలు యాడ్స్ చేస్తూ బాగానే సంపాదిస్తోంది. అయితే చివరగా స్నేహ మమ్ముట్టి ‘క్రిస్టోఫర్’ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత ఏ కొత్త మూవీ ప్రకటించలేదు.

ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న స్నేహ తన భర్తకు సంబంధించిన ఓ సీక్రెట్ రివీల్ చేసింది. ‘‘ జనాల్లో పొజెసివ్‌నెస్ ఉండాలి కానీ అతిగా ఉండకూడదు. ముఖ్యంగా జంటల మధ్య అస్సల్‌కే ఉండకూడదు. ఎందుకంటే.. నమ్మకాన్ని బ్యాలెన్స్ చేయడం కష్టంగా మారి ఇద్దరి మధ్య గొడవలు వస్తాయి. ఉదాహరణకు.. పార్ట్‌నర్ ఎక్కడికైనా వెళ్లేటప్పుడు.. ఎందుకు.. వెళ్లి ఏం చేస్తావ్ అని అనుమానం రావొద్దు. భాగస్వామిని సరిగ్గా అర్థం చేసుకుంటే అసలు ఇలాంటి ప్రశ్నలు రావు. అయితే ఇద్దరి మధ్య నమ్మకం ఉండాలి అప్పుడే జీవితం సంతోషంగా ఉంటుంది. పార్ట్‌నర్ అడకముందే వారికి చెప్పి వెళ్తే వాళ్లకి కూడా పొజెసివ్‌నెస్ రాదు. అలాగే మనం వెళ్లాలనుకున్న చోటుకి చేరుకున్నాక.. భాగస్వామికి ఫోన్ చేసి చెప్తే బెటర్.

వారితో కాసేపు మాట్లాడితే.. ప్రేమ పెరిగి బంధం మరింత బలపడుతుంది. అయితే నా భర్త కూడా ఒకానొక సమయంలో ఓ అమ్మాయిని లవ్ చేశాడు. కానీ ఏవో కారణాల వల్ల ఇద్దరు బ్రేకప్ చెప్పుకుని విడిపోయారు. ఈ విషయం తెలిసాక నాకు సంతోషంగా అనిపించింది. ఎందుకంటే అలా విడిపోక పోతే ప్రసన్న కుమార్ నాకు భర్త అయ్యేవాడు కాదు కదా. ఈ విషయంలో నాకు ఎలాంటి సమస్య రాలేదు. కానీ ఓ సమస్య వల్ల ఒత్తిడికి లోనయ్యాను. అలా ఒక ఏడాది పాటు గడిపాను. అప్పుడే నాకు ఓ అవార్డ్ రావడంతో.. ఒత్తిడి నుంచి బయట పడ్డాను. ఇప్పుడు నా ఫ్యామిలీతో సంతోషంగా గడుపుతున్నాను’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం స్నేహ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.


Next Story

Most Viewed